
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు అధునాతన హెలికాప్టర్లు వచ్చేశాయి. అపాచీ ఫైటర్ హెలికాప్టర్లు మన ఎయిర్ ఫోర్స్‌లో చేరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు చేరవేసే సత్తా అపాచీ ఫైటర్ హెలికాప్టర్లకు ఉంది. వీటికి ఏరియల్ ట్యాంక్స్ అని మరో ముద్దుపేరు కూడా ఉంది. అంటే.. ఆకాశంలో ఎగిరే యుద్ధట్యాంకులు అన్నమాట. సరిహద్దుల్లో ఇండియా ఎటాకింగ్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఫస్ట్ బ్యాచ్‌లో మూడు అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి ఇండియాకొచ్చేశాయ్. వీటిని పాకిస్థాన్ సరిహద్దుల్లో మోహరించబోతున్నట్టు ఇప్పటికే సంకేతాలిచ్చింది రక్షణశాఖ.
ప్రస్తుతానికి వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు చెందిన హిండన్ వైమానిక స్థావరంలో అపాచీ యుద్ధ హెలికాప్టర్లకు బేస్ రెడీగా ఉంది. హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పాకిస్తాన్ వైపు గురిపెట్టబోతున్నాయి అపాచీ ఎటాకర్లు. 2015లో అమెరికా ప్రభుత్వంతో, బోయింగ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం 22 అపాచీ హెలికాప్టర్‌లొచ్చాయి. తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చినప్పుడు మరో 6 అపాచీ హెలికాప్టర్‌ల కొనుగోలుకు డీల్ ఓకే ఐంది. తొలి స్పెల్‌లో మూడు అపాచీ హెలికాప్టర్‌లు గత జూన్ నెల్లో ఇండియాకు రావాల్సి ఉంది. కొన్ని సాంకేతిక, భౌతిక కారణాలవల్ల అపాచీ ఫైటర్ల డెలివరీ ఆలస్యమైనా… పెర్ఫామెన్స్‌లో మాత్రం వీటికి తిరుగులేదు.
దుమ్ముధూళి కమ్ముకున్నా, పొగమంచు కురుస్తున్నా… ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవు అపాచీ హెలికాప్టర్లు. కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, ఆయుధ వ్యవస్థలతో పాటు… నైట్ విజన్ నావిగేషన్ ఇందులో మరో స్పెషాలిటీ. అపాచీ హెలికాప్టర్లను దాడి చేయడానికి మాత్రమే కాదు భద్రత, నిఘా కార్యకలాపాల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి.
శత్రుసేనలపై దాడులకు, గూఢచర్యానికి రెండు విధాలుగా వినియోగిస్తారు. రుద్ర హెలికాప్టర్లతో పాటు అపాచీల్ని ఆపరేట్ చేయడం కోసం ఇండియన్ పైలెట్లు అమెరికాలో స్పెషల్‌గా ట్రెయినింగ్ తీసుకున్నారు. అపాచీ హెలికాప్టర్ AH-64E.. ఒక్కొక్క దాని ఖరీదు ఒక మిలియన్ డాలర్లు. అంటే దాదాపు ఎనిమిదిన్నర కోట్ల కంటే ఎక్కువ. దీని చేరిక ఇండియన్ ఆర్మీ జర్నీలో ఒక మైలురాయిగా మారబోతోంది.
#WATCH | The first batch of Apache attack Helicopters for the Indian Army has reached India. The choppers will be deployed in Jodhpur by the Indian Army: Indian Army officials
(Source: Indian Army) pic.twitter.com/zvSC5pXvgZ
— ANI (@ANI) July 22, 2025