Chinook Helicopter: అమెరికా నిర్ణయంపై భారత ఆర్మీ అభ్యంతరం.. చినూక్ విమానాల నిలిపివేతపై ఆందోళన

చినూక్ హెలికాప్టర్ల సేవలను అర్థాంతరంగా నిలిపివేసింది అమెరికా ఆర్మీ. ఇంజిన్‌లో మంటలు వచ్చే అవకాశం ఉందని ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో

Chinook Helicopter: అమెరికా నిర్ణయంపై భారత ఆర్మీ అభ్యంతరం.. చినూక్ విమానాల నిలిపివేతపై ఆందోళన
Chinook Helicopter

Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:10 PM

అమెరికా తీసుకున్న నిర్ణయాలపై భారత ఆర్మీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చినూక్ హెలికాప్టర్ల సేవలను అర్థాంతరంగా నిలిపివేసింది అమెరికా ఆర్మీ. ఇంజిన్‌లో మంటలు వచ్చే అవకాశం ఉందని ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్క చినూక్ హెలికాప్టర్‌ కూడా గాలిలోకి ఎగరకుండానే నేలకే పరిమితమయ్యాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినూక్ విమానాలను భారత వాయుసేన విరివిగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి సేవలను నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని గురించి వివరణ ఇవ్వాలని అమెరికాకు లేఖ రాసింది. 70 చినూక్ హెలికాప్టర్లను పరిశీలించిన తర్వాత అందులోని ఓ భాగం వల్ల ఇంజిన్‌లో మంటలు సంభవించే ముప్పు ఉందని అమెరికా ఆర్మీ మెటిరీయల్ కమాండ్‌ సూచించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వీటి సేవలను నిలిపివేశారు అధికారులు. గతంలో పలుమార్లు ఈ హెలికాప్టర్ ఇంజిన్‌ నుంచి మంటలు వచ్చి చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

చినూక్ హెలికాప్టర్లను లాజిస్టిక్‌ సేవలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వందల టన్నుల బరువును ఇవి మోయగలవు. వీటిని తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంతో అమెరికా సైన్యానికి వస్తు రవాణాలో సవాళ్లు ఎదరుయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు అమలులో ఉంటాయి అనే విషయంపై కూడా స్పష్టత లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం