
India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. థర్డ్‌వేవ్ ప్రారంభంలో ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు మూడు లక్షలకు పైగా నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) దేశవ్యాప్తంగా నిన్న 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 514 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారంతో పోల్చుకుంటే.. కరోనా కేసుల సంఖ్య 11 శాతం పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
దేశంలో 3,70,240 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,27,23,558 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,09,872 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 82,988 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,18,43,446 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 173.86 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: