Covid-19 Updates in India: దేశంలో కరోనా ఉధృ నానాటికీ పెరుగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్న కేసులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 26,115 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 252 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,04,534 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,45,385 చేరింది. నిన్న కరోనా నుంచి 34,469 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,27,49,574 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,09,575 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. 184 రోజుల తర్వాత యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలకు తగ్గినట్లు హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ప్రస్తుతం రికవరీ రేటు దేశంలో 97.75 శాతంగా ఉండగా.. పాజిటివ్ రేటు 2.08 శాతంగా ఉంది.
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81,85,13,827 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 96,46,778 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
నిన్న దేశవ్యాప్తంగా 14,13,951 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 55,50,35,717 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
India reports 26,115 new #COVID19 cases, 252 deaths & 34,469 recoveries in last 24 hrs, says Health Ministry
Total Cases: 3,35,04,534
Total Active cases: 3,09,575
Total Recoveries: 3,27,49,574
Total Death toll: 4,45,385Total vaccination: 81,85,13,827 (96,46,778 in 24 hrs) pic.twitter.com/CzL8Ugj7lq
— ANI (@ANI) September 21, 2021
Also Read: