
India Covid-19 Updates: దేశంలో కరోనావైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య (Coronavirus) క్రమంగా తగ్గుతూ వస్తోంది. నిన్న కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదైంది. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా నిన్న 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 673 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో 2,24,187 కేసులు (0.52%) యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,20,86,383 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,11,903 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 48,847 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,20,86,383 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,75,37,22,697 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: