
India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా తుగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం ఇటీవల రోజువారి కేసుల సంఖ్య (Coronavirus) తగ్గుతూ వస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో (సోమవారం) దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. నిన్న దేశంలో 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 235 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితోపోల్చుకుంటే.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1,81,075 (0.42%) కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల 4,21,15,839 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,12,344 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం వెల్లడించింది.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 34,226 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,21,58,510 కి పెరిగింది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,75,83,27,441 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: