India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో

India Corona: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona

Updated on: Oct 31, 2021 | 9:36 AM

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ.. మళ్లీ పెరిగిన కేసులు ఆందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో తగ్గుతున్న కేసులు కాస్త ఉపశమనం కలిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,830 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 446 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,73,300 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,58,186 కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో1,59,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 247 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు భారీగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా.. నిన్న కరోనా నుంచి 14,667 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,36,55,842 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.20 శాతానికి పైగా ఉంది. మార్చి తర్వాత కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది. కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,06,14,40,335 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 11,35,142 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 60,83,19,915 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.


Also Read:

Corona Virus: అమలాపురం డివిజన్‌లో కరోనా టెన్షన్.. రోజు రోజుకీ ఉద్యోగుల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు

Vaccine Patches: సూది లేకుండానే కరోనా వ్యాక్సిన్‌.. త్వరలో అందుబాటులోకి రానున్న ప్యాచ్‌లు..!

Loading...
Unable to load recommendations.
Follow Us