Coronavirus: దేశంలో కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో లక్షా 26 వేలు దాటిన కేసుల సంఖ్య

|

Apr 08, 2021 | 10:31 AM

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటుతుండటం కలవరపెడుతోంది. తాజగా ఈ కేసుల సంఖ్య

Coronavirus: దేశంలో కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో లక్షా 26 వేలు దాటిన కేసుల సంఖ్య
Coronavirus Updates In India
Follow us on

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్కు దాటుతుండటం కలవరపెడుతోంది. తాజగా ఈ కేసుల సంఖ్య లక్షా 26 వేలు దాటడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో బుధవారం దేశవ్యాప్తంగా 1,26,789 కరోనా కేసులు నమోదయ్యారు. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో 685 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 (1.29 కోట్లు) కు పెరిగింది. దీంతోపాటు మరణించిన వారి సంఖ్య 1,66,862 కు చేరింది. గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే.. ఈ సంఖ్య మరింత భారీగా రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. కరోనా నుంచి నిన్న 59,258 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,18,51,393 (1.18 కోట్లు) మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,10,319 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 91.67 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.29 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 12,37,781 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 8వ తేదీ వరకు మొత్తం 25,26,77,379 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 9,01,98,673 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Also Read:

Narendra Modi: నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. కోవిడ్‌ పరిస్థితులపై కీలక నిర్ణయాలు..!

Coronavirus: హృదయవిదారక ఘటన.. ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు