Corona Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,666 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,01,193కి చేరింది. నిన్న కొత్తగా 14,301 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు వైరస్ నుంచి 1,03,73,606 కోలుకున్నారు. కాగా, బుధవారం ఒక్కరోజే 123 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,53,847కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,73,740 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.