PM Modi: నెక్స్ట్ ఏంటి..? త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ..

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం.. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హాజరయ్యారు.

PM Modi: నెక్స్ట్ ఏంటి..? త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ..
India and Pakistan

Updated on: May 11, 2025 | 4:19 PM

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం.. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హాజరయ్యారు. ఆపరేషన్‌ సింధూర్, కాల్పుల విరమణ అంశంతో పాటు.. రేపటి భారత్-పాక్‌ సైనికాధికారుల సమావేశం, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధతపైనా చర్చిస్తున్నారు.

భారత్‌-పాక్‌ దేశాలు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని పాక్‌ ఉల్లంఘించడంపైనా మీటింగ్‌లో చర్చిస్తున్నారు. పాక్‌ పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనా మీటింగ్‌లో వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపైనా ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు రేపటి DGMOల సమావేశంలో ఏం మాట్లాడాలి…? ఎలాంటి అంశాలు పాక్‌ అధికారుల ముందుంచాలి.. ఏ విధంగా స్పందించాలి అన్న అంశంపైనా చర్చించారు.

భారత్‌-పాక్‌ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు..

అయితే.. సోమవారం భారత్‌-పాక్‌ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు జరగనున్నాయి. రెండుదేశాల మిలటరీ ఆపరేషన్స్ అధికారులు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గించడం.. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కాల్పుల విరమణపై శనివారం భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. అనంతరం శనివారం రాత్రి, పాకిస్తాన్ అవగాహన నిబంధనలను ఉల్లంఘించిందని భారతదేశం ఆరోపించింది.. ఉల్లంఘనలను పరిష్కరించడానికి.. పరిస్థితిని “తీవ్రత – బాధ్యతతో” నిర్వహించడానికి “తగిన చర్యలు” తీసుకోవాలని పాక్ ను కోరింది. అంతేకాకుండా.. పాక్ కాల్పులకు తెగబడితే.. ధీటుగా స్పందించాలని ఆర్మీని ఆదేశించింది.. అయితే.. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి.. ఈ క్రమంలో ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..