ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు: మూడు వారాల్లో మారిన భారత్ మూడ్.. సర్వేలో ఆసక్తికర విషయాలు

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు బయటపడ్డాయి. భారత్ ప్రజలు మెజారిటీగా తటస్థ వైఖరినే కోరుకుంటున్నప్పటికీ, అవసరం వస్తే ఇరాన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో రష్యాపై విశ్వాసం బలంగా ఉండగా, యుద్ధ ప్రభావం ఆర్థిక వ్యవస్థతో పాటు గ్యాస్ ధరలపై తీవ్రంగా పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు: మూడు వారాల్లో మారిన భారత్ మూడ్.. సర్వేలో ఆసక్తికర విషయాలు
India Iran Us War Survey

Updated on: Apr 04, 2026 | 5:54 PM

ప్రపంచవ్యాప్తంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. భారత్ ఎలాంటి వైఖరి తీసుకోవాలి? ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? అనే అంశాలపై నిర్వహించిన తాజా సర్వేలో కీలక సంకేతాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా సీవోటర్ నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 10,854 మంది పాల్గొన్నారు. మార్చి రెండో వారం నుంచి నాలుగో వారం వరకు అభిప్రాయాలు సేకరించారు. టెలిఫోన్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించారు.

1.సంక్షోభ సమయంలో “భారత్ ఎవరిని నమ్మాలి?” అన్న ప్రశ్నకు

మార్చి రెండో వారం:

అమెరికా – 26%,

ఇరాన్ – 27%,

చెప్పలేము – 47%

మార్చి మూడో వారం:

అమెరికా – 26%,

ఇరాన్ – 38%,

చెప్పలేము – 36%

మార్చి నాలుగో వారం:

అమెరికా – 15%,

ఇరాన్ – 58%,

చెప్పలేము – 27%

మూడు వారాల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇరాన్‌పై నమ్మకం వేగంగా పెరిగింది.

2.ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తటస్థంగా ఉండాలా? అన్న ప్రశ్నకు

రెండో వారం – 58% అవును

మూడో వారం – 61% అవును

నాలుగో వారం – 60% అవును

భారత్ యుద్ధానికి దూరంగా ఉండాలని మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

3.వైఖరి తీసుకోవాల్సి వస్తే.. భారత్ ఏ దేశంవైపు నిలబడాలి అని అడగ్గా….

రెండో వారం – ఇరాన్ 56%, అమెరికా 44%

మూడో వారం – ఇరాన్ 62%, అమెరికా 38%

నాలుగో వారం – ఇరాన్ 74%, అమెరికా 26%

ప్రతి వారం ఇరాన్‌కు మద్దతు పెరిగడం గమనార్హం

4. అంతర్జాతీయంగా ఏ దేశంపై నమ్మకం ఉంచాలన్న ప్రశ్న సంధించగా….

రెండో వారం – రష్యా 67%, అమెరికా 10%

మూడో వారం – రష్యా 73%, అమెరికా 11%

నాలుగో వారం – రష్యా 70%, అమెరికా 14%

మూడు వారాల్లో కూడా రష్యాపై స్థిరమైన, భారీ విశ్వాసం కనిపించింది

5. భారత్‌కు ముప్పు ఏ దేశంతో అన్న ప్రశ్నకు…..

రెండో వారం – చైనా 41%, పాకిస్తాన్ 30%

మూడో వారం – చైనా 44%, పాకిస్తాన్ 31%

నాలుగో వారం – చైనా 44%, పాకిస్తాన్ 34%

ప్రధాన ముప్పుగా ప్రజలు చైనానే చూస్తున్నారు.

6. భారత విదేశాంగ విధానం ఎలా ఉందని ప్రశ్నించగా….

నాలుగో వారం:

చాలా వరకు సంతృప్తి – 32%

కొంత వరకు సంతృప్తి – 21%

అసంతృప్తి – సుమారు 42%

మొత్తం మీద మిశ్రమ అభిప్రాయం వ్యక్తమైంది

7. యుద్ధ ప్రభావం మన దేశంలో ఏ విభాగాలపై ఎక్కువగా అన్న ప్రశ్న సంధించగా

ఆర్థిక వ్యవస్థ – 45% నుంచి 50%

విదేశాంగ విధానం – 13% నుంచి 16%

రాజకీయాలు – 11% నుంచి 13%

ప్రజల ఆందోళన ఎక్కువగా ఆర్థిక వ్యవస్థపైనే ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తుంది…

8. గ్యాస్ సమస్య: ఇప్పటికీ ప్రభావం ఉందా అన్న ప్రశ్నకు

రెండో వారం – 64% ఇబ్బంది

మూడో వారం – 65%

నాలుగో వారం – 65%

మూడు వారాల్లో కూడా పరిస్థితి మారలేదని అర్థమవుతుంది

9. ఇంధన ధరల పెరుగుదలపై భయంతో ఉన్నారా అని ప్రశ్నించగా…

82% మంది ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు…
ఎక్కువ మంది 10% నుంచి 50% వరకు పెరుగుదల అంచనా వేశారు..

ఇంధన కొరత వస్తే ప్రజల ప్లాన్

66% → కట్టెలు పొయ్యిల వైపు మొగ్గు చూపారు

16% → విద్యుత్ పరికరాలు

8% → వంట తగ్గించడం

10. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ మారుతుందా? అన్న ప్రశ్నకు

సుమారు 52% మంది మార్పు వస్తుందని భావిస్తున్నారు

 

మూడు వారాల ఈ సర్వే ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. భారత్ ప్రజలు యుద్ధానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇరాన్ వైపు మొగ్గు ఉంది. ముఖ్యంగా.. ఈ యుద్ధ ప్రభావం ఇప్పటికే ప్రజల జీవితాల్లోకి చేరిందన్నది ఈ నివేదికతో స్పష్టమైంది.

Follow Us