India-Canada row: కెనడాకు భారతీయ విద్యార్థులు వెళ్ళకుంటే నష్టం ఎవరికో తెలుసా.. కారణాలు ఇవే..

|

Sep 28, 2023 | 7:57 PM

భారత్, కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు స్టూడెంట్స్‌ పాలిట శాపంగా మారుతున్నాయి. భారత్ కెనడా పౌరులకు వీసాల జారీని ఇప్పటికే నిలిపివేసింది. అంతేకాదు భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కెనడా కూడా తమ దేశంలోకి వచ్చే భారత పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తే వివాదం మరింత జఠిలమౌతుంది. అయితే, కెనడాకు ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని ఎంచుకునే యోచనలో ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాల వైపు చూస్తున్నారు భారతీయ విద్యార్థులు.

India-Canada row: కెనడాకు భారతీయ విద్యార్థులు వెళ్ళకుంటే నష్టం ఎవరికో తెలుసా.. కారణాలు ఇవే..
Indian Students
Follow us on

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు భారతీయ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్య, ఉద్యోగాలకు ఆకర్షణీయ దేశం కావడంతో కెనడాను తమ తొలి ప్రాధామ్య దేశంగా భారతీయ విద్యార్ధులు ఇంతకాలం ఎంచుకుంటూ వచ్చారు. దీనికి తగ్గట్లుగా గత ఏడాది కెనడా 2.65 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేయగా వీరిలో ఒక్క పంజాబ్‌ నుంచే 1.32 లక్షల మంది విద్యార్థులున్నారు.

అదే సమయంలో కెనడా గత ఏడాది 11,800 మంది భారతీయులకు పర్మినెంట్ రెసిడెంట్ హోదా ఇచ్చింది. మొత్తం పీఆర్‌లో ఇది 27శాతం. భారతీయ విద్యార్ధులు కెనడా ఎకానమీకి పెద్ద ఎత్తున దోహదపడుతున్నారు. 2021 లెక్కల ప్రకారం కెనడాకు 4.9 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరింది. ఇది కెనడా వార్షిక బడ్జెట్‌లో 30 శాతం. కెనడాలో 20 లక్షల మంది భారతీయులున్నారు. కెనడాలోని 80 శాతం దక్షిణాసియా జనాభాలో ఇది 6 శాతం. భారత్‌ ఐదో అతి పెద్ద ఆర్ధిక శక్తి కాగా కెనడా తొమ్మిదో అతిపెద్ద ఆర్ధిక శక్తి.

రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి..

వారం క్రితం కెనడా పార్లమెంట్‌లో ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రుడో భారత్‌పై చేసిన తీవ్ర ఆరోపణలతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో భారత్‌కు సంబంధం ఉందనటానికి బలమైన ఆరోపణలున్నాయంటూ ట్రుడో వ్యాఖ్యానించడం రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కారణమయ్యాయి. రెండు దేశాలూ తమ దౌత్యవేత్తలను బహిష్కరించుకున్నాయి.

భారత పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తే..

అంతేకాదు భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కెనడా కూడా తమ దేశంలోకి వచ్చే భారత పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తే వివాదం మరింత జఠిలమౌతుంది. వివాదం నేపథ్యంలో భారత్‌ నుంచి కెనడాకు వెళ్లాలనుకునే వారికి వీసాల జారీ ప్రక్రియ ఆలస్యమౌతోంది.

కెనడాకు ప్రత్యామ్నాయంగా మరో దేశం..

తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత విద్యార్ధులు కెనడాకు ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని ఎంచుకునే యోచనలో ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాల వైపు చూస్తున్నారు భారతీయ విద్యార్థులు. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తగ్గి వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని భారతీయ విద్యార్థులు కోరుకుంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి