Jobs: నకిలీ ఉద్యోగాల పట్ల జాగ్రత్త.. ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక..!

|

Feb 22, 2022 | 4:53 PM

Jobs: కరోనా కాలంలో నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ ఉద్యోగాల పేరిట మోసాలు ఎక్కువయ్యాయి. నెలల తరబడి నిరుద్యోగులు సైతం నకిలీ ఉద్యోగాల..

Jobs: నకిలీ ఉద్యోగాల పట్ల జాగ్రత్త.. ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక..!
Follow us on

Jobs: కరోనా కాలంలో నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ ఉద్యోగాల పేరిట మోసాలు ఎక్కువయ్యాయి. నెలల తరబడి నిరుద్యోగులు సైతం నకిలీ ఉద్యోగాల (Fake Jobs) వలలో పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయపు పన్ను శాఖ ప్రజలను ప్రత్యేకంగా హెచ్చరించింది . ఎలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మీకు ఎవరైనా ఏదైనా ఉద్యోగం ఆఫర్ చేస్తే అది నకిలీ. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department)లో ఉద్యోగాలకు సంబంధించి చాలా మందికి నకిలీ జాయినింగ్ లెటర్లు కూడా జారీ అవుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. చాలా మంది అభ్యర్థులకు నకిలీ ఆఫర్ లెటర్లు, జాయినింగ్ లెటర్లు కూడా జారీ అయ్యాయి. ఇలాంటి మోసాల (Fraud) పట్ల అప్రమత్తంగా ఉండాలి.

SSC ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగాలు:

ఆదాయపు పన్ను శాఖ తరపున డిపార్ట్‌మెంట్‌లోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిటీ (SSC) ద్వారా జారీ చేయబడతాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం SSC వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మోసాలకు లోనుకావద్దని, నకిలీ ఉద్యోగాల జోలికి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఆదాయపు పన్ను శాఖ.

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల హెచ్చరిక!

దేశంలో చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది పార్ట్‌టైమ్ ఉద్యోగాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ద్వారా నెలకు 40-50 వేలు సంపాదించే ఆఫర్‌లు కూడా మీకు లభిస్తుంటే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మీ డబ్బుపై కన్నేసి ఉంచుతున్నారు. సైబర్ దోస్త్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అప్రమత్తం చేస్తోంది. జాబ్‌ ఆఫర్లకు సంబంధించినవి ఏవి కూడా నమ్మవద్దని తెలిపింది.

 

 

ఇవి కూడా చదవండి:

UPSC CISF AC 2022 exam date: సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్‌ 2022 హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Tourist Places : భారతదేశంలో రాత్రిపూట మరింత అందంగా కనిపించే ప్రదేశాలు ఇవే