కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కి 31 న శిక్ష ?

| Edited By: Pardhasaradhi Peri

Aug 29, 2020 | 7:47 PM

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కి శిక్షను సుప్రీంకోర్టు ఈ నెల 31 సోమవారం ప్రకటించనుంది. న్యాయవ్యవస్థ పైన, చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే పైన అనుచిత ట్వీట్లు చేశారన్న ఆరోపణలు..

కోర్టు ధిక్కరణ కేసులో ప్రశాంత్ భూషణ్ కి 31 న శిక్ష ?
Follow us on

కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ కి శిక్షను సుప్రీంకోర్టు ఈ నెల 31 సోమవారం ప్రకటించనుంది. న్యాయవ్యవస్థ పైన, చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే పైన అనుచిత ట్వీట్లు చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ ట్వీట్లకు క్షమాపణ చెబితే సరిపోతుందని కోర్టు పేర్కొన్నప్పటికీ, ఇందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. ఈ కేసులో తీర్పును జస్టిస్ అరుణ్ మిశ్రా సోమవారానికి రిజర్వ్ లో ఉంచారు.

తన వంద పేజీల స్టేట్ మెంట్ లో ఈ లాయర్.. ఈ దశలో అపాలజీ చెబితే అది తన మనస్సాక్షిని ధిక్కరించినట్టే అవుతుందన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రశాంత్ భూషణ్ బేషరతుగా సారీ చెప్పాలని కోర్టు కోరింది. కానీ ఆ ప్రసక్తి లేదని ఆయన తరఫు లాయర్ రాజీవ్ ధావన్ తేల్చి చెప్పారు.