కర్నాటకలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఎలుకల మందు పేస్టును.. టూత్ పేస్ట్‌గా భావించి.. తన ప్రాణాలకే ముప్పుతెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని మాల్పేలో ఓ మహిళ.. తెల్లవారుజామునే నిద్రలేచి.. బ్రష్ చేసుకుంది. అయితే టూత్ పేస్ట్, ఎలుకల మందుకు సంబంధించిన విషం రెండూ ఒకే రకంగా ఉండడాన్ని ఆమె గమనించలేదు. ఎలుకల మందుకు సంబంధించిన పేస్ట్ వంటిదాన్ని బ్రష్‌కు వాడటంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారం రోజులపాటు చికిత్స పొందిన ఆమె.. చివరకు ఆదివారం రోజు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. టూత్ పేస్ట్ బదులుగా ఎలుకల మందు ఉపయోగించడంతోనే ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.