Lock Down Effect: ఘనంగా వివాహ వేడుక.. అధికారుల మెరుపు దాడి.. వధువుని విడిచిపెట్టి పరారైన వరుధు కారణమేంటంటే..

|

May 26, 2021 | 11:15 PM

Lock Down Effect: అసలే కరోనా కాలం. ఎవరి నుంచి ఎవరికి వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి. వెరసి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండి..

Lock Down Effect: ఘనంగా వివాహ వేడుక.. అధికారుల మెరుపు దాడి.. వధువుని విడిచిపెట్టి పరారైన వరుధు కారణమేంటంటే..
Marriage
Follow us on

Lock Down Effect: అసలే కరోనా కాలం. ఎవరి నుంచి ఎవరికి వ్యాపిస్తుందో తెలియని పరిస్థితి. వెరసి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండి.. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్ కంటే కూడా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో ఆయా రాష్ట్రాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు దేశ వ్యా్ప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. పలు ఆంక్షల నడుమ వివాహాలు, ఇతర కార్యక్రమాలు మాత్రం అనుమతించారు. అయితే, కొందరు ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహ వేడుకను 30 మంది సమక్షంలోనే వివాహ వేడుక చేసుకోవాలని అధికారులు ఆంక్షలు పెట్టగా.. కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. మరికొందరైతే 30 మంది అని పర్మిషన్ తీసుకుని.. ఆ తరువాత 300 మంది మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. కర్ణాటకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చిక్‌మంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. కడూర్ తాలూకాలోని ఓ గ్రామంలో వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు 300 మందికి పైగా హాజరయ్యారు. అంతేకాదు.. వివాహానికి అనుమతి కూడా తీసుకోలేదు. విషయం తెలుసుకున్న అధికారులు ఉకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారుల ఆకస్మిక దాడితో పెళ్లికి వచ్చిన వారు ఎక్కడివారక్కడ పరార్ అయ్యారు. చివరికి పెళ్లి కొడుకు కూడా వధువుని విడిచి పెళ్లి పారిపోయాడు. ఈ పెళ్లి వ్యవహారంలో అధికారులు 10 మందిపై కేసు నమోదు చేశారు.

ఇలాంటి ఘటనే మాండ్యా జిల్లాలోని బిహోసూర్‌ గ్రామంలోనూ వెలుగు చూసింది. ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ సభ్యుడి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు 300 మందికి పైగా హాజరయ్యారు. నిబంధనల ప్రకారం పెళ్లి చేయడానికి తహశీల్దార్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ వీరు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అధికారులు ఈ పెళ్లి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలాఉంటే.. కొందరు ప్రజలు 30 మంది పేరుతో అనుమతి తీసుకుని.. అంతకు మించి జనాలను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజల తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నిబంధనలు ఉల్లంఘించేది వారే అని, పైగా అధికారులు పెళ్లిని అడ్డుకున్నారని నిందలు వేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ఘటనపై మాండ్య డిప్యూటీ కమిషనర్ అశ్వతి మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం కఠినమైన నిబంధనలు రూపొందించామని, ప్రజలు అర్థం చేసుకుని నిబంధనలను పాటించాలని కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్ ప్రకారం వివాహం చేసుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 30 మందికి పైగా జనాలు వివాహ వేడుకలో కనిపిస్తే ఫంక్షన్ లైసెన్స్ ఒక నెల రోజుల పాటు రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Also read:

Viral Video: గుడారంలో ప్రశాంతంగా పడుకున్న టూరిస్ట్.. అంతలోనే వచ్చిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..

TDP Mahanadu : ‘మహానాడు’ను వరుసగా రెండో ఏడాది జూమ్ లో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ. రేపు ఉదయం 10 గంటల నుంచి