IFS ఆఫీసర్‌ ఆత్మహత్య.. బిల్డింగ్‌పై నుంచి దూకి బలవన్మరణం! ఏం జరిగిందో..

|

Mar 07, 2025 | 4:49 PM

ప్రతిష్టాత్మక కొలువు చేస్తున్న ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీస్ (IFS) అధికారి ఒకరు శుక్రవారం (మార్చి 7) బిల్డింగ్‌పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ ఆయన ఒక్కసారిగా ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు..

IFS ఆఫీసర్‌ ఆత్మహత్య.. బిల్డింగ్‌పై నుంచి దూకి బలవన్మరణం! ఏం జరిగిందో..
IFS officer suicide
Follow us on

న్యూఢిల్లీ, మార్చి 7: ఇండియ‌న్ ఫారిన్ స‌ర్వీస్ (IFS) అధికారి శుక్రవారం (మార్చి 7) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ ఢిల్లీలోని చాణ‌క్యపురిలో ఉన్న ఓ బిల్డింగ్ మీద నుంచి కింద‌కు దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతి చెందిన ఆఫీస‌ర్‌ను జితేంద్ర రావ‌త్‌గా పోలీసులు గుర్తించారు.

ఐఎఫ్‌ఎస్‌ అధికారి జితేంద్ర రావత్‌ మృతిలో ఎటువంటి అనుమానాలు లేవ‌ని పోలీసులు స్పష్టం చేశారు. ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ వ‌య‌సు 35 నుంచి 40 ఏళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. ఆయన గత కొంత కాలంగా డిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారనీ, తల్లితోపాటు ఎమ్‌సీఏ సొసైటీలోని ఫస్ట్‌ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ రోజు ఆయన ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి 4వ ఫ్లోర్‌కి వెళ్లి, అక్కడి నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆఫీస‌ర్ జితేంద్ర ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఖచ్చితమైన కారణం తెలియట్లేదని, ఆయన మృతి ప‌ట్ల ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు చెప్పారు. కాగా సూసైడ్‌ చేసుకున్న ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ జితేంద్ర భార్య, పిల్లలు డెహ్రాడూన్‌ ఉంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.