MS Dhoni: తమిళనాడు పాలిటిక్స్‌లో ధోనీ పేరు రీసౌండ్.. ప్రశాంత్ కిషోర్ స్కెచ్ మామూలుగా లేదుగా..

|

Feb 26, 2025 | 8:22 PM

తమిళగ వెట్రి కజగం (TVK) మహానాడు చెన్నైలో యమా గ్రాండ్‌గా జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి కార్యక్రమానికి విజయ్‌ హాజరుకావడం హాట్‌టాపిక్‌గా మారింది. మహాబలిపురంలో జరిగిన టీవీకే తొలి వార్షికోత్సవ సమావేశంలో విజయ్.. తన స్పీచ్‌లో ఆరు ప్రధాన అంశాలను ప్రస్తావించారు.. మహిళల భద్రతతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు.

MS Dhoni: తమిళనాడు పాలిటిక్స్‌లో ధోనీ పేరు రీసౌండ్.. ప్రశాంత్ కిషోర్ స్కెచ్ మామూలుగా లేదుగా..
Tamil Nadu Politics
Follow us on

తమిళగ వెట్రి కజగం (TVK) మహానాడు చెన్నైలో యమా గ్రాండ్‌గా జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి కార్యక్రమానికి విజయ్‌ హాజరుకావడం హాట్‌టాపిక్‌గా మారింది. మహాబలిపురంలో జరిగిన టీవీకే తొలి వార్షికోత్సవ సమావేశంలో విజయ్.. తన స్పీచ్‌లో ఆరు ప్రధాన అంశాలను ప్రస్తావించారు.. మహిళల భద్రతతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు టీవీకే దూరంగా ఉంటుందని తెలిపారు. కుల,మతాల ప్రస్తావన వద్దే వద్దంటూ నేతలకు సూచించారు. త్రిభాషా సూత్రానికి తమపార్టీ పూర్తి వ్యతిరేకమన్న ఆయన… పాలనా వైఫల్యాలను ఎండగట్టాలి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక 2026లో తమిళనాడులో చరిత్ర సృష్టించబోతున్నామన్న ధీమా వ్యక్తం చేశారు విజయ్‌. అన్నాదురై, MGR తెచ్చిన మార్పులను తీసుకొస్తామన్నారు. త్వరలోనే పార్టీలోకి కీలక నేతలు చేరబోతున్నారని తమిళనాట పొలిటికల్‌ మంటలు పుట్టించారు. అంతేకాదు.. బీజేపీకి దగ్గరయ్యే అవకాశమే లేదంటూ తేల్చి చెప్పారు విజయ్..

ఈ సభలో ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోని పేరు అందరికీ తెలుసని.. ఆయన ఎక్కువగా తమిళనాడులోనే ఫేమస్ అంటూ పేర్కొన్నారు.. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని CSK (చెన్నై సూపర్ కింగ్స్) ను గెలిపించినట్టు తాను TVK విజయ్ పార్టీని గెలిపిస్తా అంటూ పేర్కొన్నారు. తలపతి విజయ్ (TVK)పార్టీని గెలిపిస్తే ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ తమిళనాడులో వస్తుంది అంటూ ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

“ఎంఎస్ ధోని పేరు మీద చాలా చర్చ జరుగుతోంది. తమిళనాడులో నాకంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన ఏకైక బిహారీ ఆయనే. ప్రశాంత్ కిషోర్ కంటే ధోని తమిళనాడులో ఎక్కువ ప్రజాదరణ పొందాడు.. కానీ వచ్చే ఏడాది, నేను మీ విజయానికి (టీవీకే) సహాయం చేసినప్పుడు, నేను ధోనిని మించి ప్రజాదరణ పొందుతాను” అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

మొత్తంగా విజయ్‌ స్పీచ్‌తో పాటు ప్రశాంత్‌ కిషోర్ రాకపైనా తమిళనాట హాట్‌హాట్‌ డిబేట్స్ నడుస్తున్నాయ్. ప్రశాంత్‌ కిషోర్‌ ఎలాంటి సలహాలు సూచనలు విజయ్‌కి ఇస్తారు…? పార్టీ గెలుపునకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..