కేజ్రీవాల్ ట్వీట్… కేంద్రానికి కీలక సూచన… ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేయాలని సలహా…

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. కరోనాతో దేశం ఇప్పటికే విలవిలలాడుతున్న నేపథ్యంలో కొత్త వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

కేజ్రీవాల్ ట్వీట్... కేంద్రానికి కీలక సూచన... ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేయాలని సలహా...
Arvind Kejriwal

Updated on: Dec 21, 2020 | 12:53 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. కరోనాతో దేశం ఇప్పటికే విలవిలలాడుతున్న నేపథ్యంలో కొత్త వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తాజాగా ట్విట్టర్ వేదికగా కేంద్రానికి కేజ్రీవాల్ కీలక సలహా ఇచ్చారు.

బ్రిటన్‌లో స్ట్రెయిన్ వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆ దేశ విమాన సర్వీసుల ద్వారా వైరస్ వ్యాప్తి భారత్‌లోకి వచ్చే ప్రమాదముందని ఆయన భయాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే యూకే నుంచి భారత్‌కు వచ్చే విమాన సర్వీసులను రద్దు చేయాలని కోరారు.

Loading...
Unable to load recommendations.
Follow Us