Viral Video: వామ్మో.. ఇతన్ని మహానటి సోదరుడు అనాల్సిందే.. కేరళ పోలీసుల ట్వీట్.. సీపీ సజ్జనార్ రీ ట్వీట్.. వీడియోను మీరూ చూసేయండి..

|

Apr 18, 2021 | 2:59 PM

Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోలీస్ డిపార్ట్‌మెంట్ యమ యాక్టీవ్‌గా ఉంటోంది. ప్రజలు చేసే తప్పులను ఎత్తి చూపుతూ..

Viral Video: వామ్మో.. ఇతన్ని మహానటి సోదరుడు అనాల్సిందే.. కేరళ పోలీసుల ట్వీట్.. సీపీ సజ్జనార్ రీ ట్వీట్.. వీడియోను మీరూ చూసేయండి..
Viral Video
Follow us on

Viral Video: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోలీస్ డిపార్ట్‌మెంట్ యమ యాక్టీవ్‌గా ఉంటోంది. ప్రజలు చేసే తప్పులను ఎత్తి చూపుతూ.. వారిలో అవగాహన కల్పిస్తూనే వినోదభరితమైన కామెంట్స్, మీమ్స్, వీడియోస్‌ను సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఈ ఫన్నీ మీమ్స్, క్యా్ప్షన్స్, వీడియోలతో నిబంధనల ఉల్లంఘనులకు చురకలు అంటిస్తూనే అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాగా ఇలాంటిదే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ముందుగా కేరళ పోలీసులు ఈ వీడియో పోస్ట్ చేసి ట్రోల్ చేయగా.. తాజాగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆ ట్రోల్‌ను మరింత పెంచారు. ఆయన సైతం ఆ వీడియోకు రియాక్ట్ అయ్యి కామెంట్ చేశారు. ఉల్లంఘనుల తీరును ఎండగట్టేలా క్యాప్షన్ పెట్టారు. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలే కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. ప్రజలు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కోవిడ్ క్యారియర్లుగా మారుతున్నారు. మాస్కులు పెట్టుకోకపోగా.. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. తాజాగా కేరళలలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. పైగా వారికి మాస్క్ కూడా లేదు. రోడ్డుపై వారు ప్రయాణిస్తున్న సమయంలోనే వారికి పోలీసు వాహనం ఎదురొచ్చింది. ఇంకేముందు.. బైక్‌ బ్రేక్ ఒక్కసారిగా పడింది. బైక్‌పై వెనుకవైపు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు దిగిపోయారు. ఒక వ్యక్తి పరుగులు తీయగా.. మరో వ్యక్తి తనకేమీ సంబంధం లేదన్నట్లుగా రోడ్డు పక్కన నడచుకుంటూ అప్పటికప్పుడు మాస్క్ ధరించి అమాయకరత్నం లా వెళ్తున్నాడు. మరి పోలీసులేమైనా సామాన్యులా?. నేరుగా అతని వద్దకే వచ్చి ఏంటి సంగతి అని గద్దాయించారు. ఈ ఘటన తాలూకు వ్యవహారం అంతా పక్కనే కరెంట్ స్తంభానికి ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను కేరళ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతటితో ఆగితేనా.. ఫన్నీ కామెంట్ కూడా పెట్టారు. ‘గోపు.. తప్పు చేయని వారు భయపడకూడదు’ అంటూ ఓ సినిమాలోని డైలాగ్‌ను పేల్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో సైబరాబాద్ సీపీ సజ్జనార్ కంట పడింది. మరి ఆయన ఊరుకుంటారా?. తెలంగాణ పోలీసులు ఛాన్స్ దొరికితే సోషల్ మీడియాలో రఫ్పాడుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అద్భుతమైన మీమ్స్, క్యాప్షన్లతో ప్రజల్లో అవగాహన కల్పి్స్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీ సజ్జనార్ కూడా ఈ వీడియోపై రియాక్ట్ అయ్యారు. అయితే నిబంధనలను ఉల్లంఘించే వారిపట్ల కాస్త విమర్శిస్తూనే కామెంట్ చేశారు. ‘వెయ్యి రూపాయల జరిమానాకి భయపడతారు కానీ.. తమ ప్రాణాలు, తమ ఇంట్లో వారి ప్రాణాల కోసం జాగ్రత్త పడరా..?’ అని క్యాప్షన్ పెట్టిన సీపీ సజ్జనార్.. ఆ వీడియోను రీ ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో మరింత వైరల్‌ అవుతోంది. ఇప్పటికే వేలాది మంది లైక్స్, కామెంట్స్ చేశారు. ‘రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తప్పకుండా అవార్డు ఇవ్వాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఇలా పారిపోయే బదులు మాస్క్ ధరించొచ్చు కదా?’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తంగా ఈ వీడియో మాత్రం ఫన్నీగా ఉన్నప్పటికీ.. కరోనా సంక్షోభం సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేస్తోంది.

CP Sajjanar Tweet:

Also read:

Earthquake in Japan and Iran : ఇరాన్ తీర ప్రాంతం, జపాన్‌ లోని మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం

Indian Navy Recruitment 2021: ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తులు ఎప్పటి నుంచంటే..

Sanjay Gaikwad: ‘కరోనావైరస్‌ దొరికితే.. ఆయన నోట్లో వేస్తా’.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..