AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. ఆ పనికి నో చెప్పిందని.. భర్త ఏం చేశాడో తెలిస్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మౌరానిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ప్రేమ వివాహం చేసుకున్న జంట మధ్య చెలరేగిన వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనతో లైంగికంగా కలవట్లేదనే కోపం పెంచుకున్న భర్త ఆమెను ఇంటిపై నుంచి తోసి హత్య చేశాడు. ఈ ఘటన స్థలానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. ఆ పనికి నో చెప్పిందని.. భర్త ఏం చేశాడో తెలిస్తే..
Crime News
Anand T
|

Updated on: Oct 29, 2025 | 9:28 PM

Share

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనతో లైంగికంగా కలవట్లేదనే కోపం పెంచుకున్న భర్త ఆమెను ఇంటిపై నుంచి తోసి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో వెలుగు చూసింది. పైనుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన మహిళ కేకలు వేసింది. మహిళ అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. మౌరానిపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సాయ్వారీ గ్రామానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తికి తీజా అనే యువతితో 2022లో వివాహం జరిగింది. వివాహానికి ముందు ఇద్దరికీ ప్రేమ వ్యవహారం ఉండేది. పెళ్లికి ముందు ముఖేష్ తరచుగా తీజ ఇంటికి వచ్చేవాడు. ఇలా ఒక రోజు తీజ ఇంటికి వచ్చిన ముఖేష్.. ఆమెతో సన్నిహితంగా ఉండడాన్ని తీజ కుటుంబ సభ్యులు చూశారు. దీంతో ఇవరువురు కుటుంబ సభ్యుల సమ్మతితో, వారు ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన తొలినాళ్లలో వీరిరువురూ బాగానే ఉన్నారు, కానీ పెళ్లైన ఒక సంవత్సరం తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు స్టార్ అయ్యాయి.

బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. సంఘటనకు ముందు రోజు ముఖేష్ తనతో లైంగికంగా కలవాలని తనను బలవంతం చేసినట్టు తీజా చెప్పుకొచ్చింది. మరుసటి రోజు కూడా ముఖేష్ తనతో కలవాలని కోరగా.. అందుకు తాను నిరాకరించినట్టు తీజా చెప్పటింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగిందని.. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవల నేపథ్యంలో.. ఇద్దరి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేనప్పుడు మనం లైంగికంగా ఎందుకు కలవాలని తాను ప్రశ్నించినట్టు తీజా తెలిపింది.

దీనితో ఆగ్రహించిన ముఖేష్, మొదట తనపై దాడి చేసి, ఆ తర్వాత, కోపంతో, తనను ఇంటి పైకప్పు నుండి తోసేసినట్టు ఆమె ఆరోపించింది.తన అరుపులు విన్న స్థానికులు వెంటనే తనను హాస్పిటల్‌కు తీకొచ్చారని ఆమె తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ముఖేష్ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా