Horse funeral karnataka – Watch Video: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సొంత కుటుంబ సభ్యులు చనిపోతేనే చివరి చూపు చూసేందుకు, అంత్యక్రియల కోసం రావడం లేదు. ఒకవేళ వచ్చినా.. తాజా నిబంధనల మేరకు 20-30 మందితోనే అంత్యక్రియలు పూర్తిచేయాలని ప్రభుత్వాలు కఠిన మార్గదర్శకాలు జారీచేశాయి. అలాంటిది ఓ గుర్రం చనిపోతే వందలాది మంది కలిసి కరోనా నిబంధనలు పాటించకుండా.. అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెలగావిలోని మరాదిమత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరాదిమత్ గ్రామంలో ఆదివారం స్థానిక మత సంస్థకు చెందిన గుర్రం చనిపోయింది. అయితే ఆ గుర్రం అంత్యక్రియల్లో వేలాది మంది కోవిడ్ నిబంధనలు పాటించకుండా హాజరై దహనసంస్కారాలు నిర్వహించారు.
కాగా.. ఈ సంఘటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామానికి సీలు వేసి పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోకి ఎవ్వరినీ రానీయడం లేదు.. గ్రామం నుంచి వెళ్లనివ్వడం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఆంక్షలు 14 రోజుల పాటు అమల్లో ఉంటాయని బెలగావి ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి స్పందించారు. జిల్లా అధికారులు ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నారని, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వీడియో..
#WATCH Hundreds of people were seen at the funeral of a horse in the Maradimath area of Belagavi, yesterday, in violation of current COVID19 restrictions in force in Karnataka pic.twitter.com/O3tdIUNaBN
— ANI (@ANI) May 24, 2021
మరాదిమత్ ప్రాంతంలోని సిద్ధేశ్వర మఠానికి చెందిన గుర్రాన్ని దేవతా అశ్వంగా గ్రామస్థులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే దాని అంత్యక్రియలకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి పాల్గొన్నారని పలువురు పేర్కొన్నారు. అయితే లాక్‌డౌన్ సమయంలో నిబంధనలు పాటించకుండా పెద్ద ఎత్తున పాల్గొనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: