PMSYM Scheme: ఈ పథకంలో చేరండి.. నెలకు రూ. 3000 పెన్షన్ పొందండి.. పూర్తి వివరాలు మీకోసం..

|

Jul 29, 2021 | 12:00 AM

PMSYM Scheme: అసంఘటిత కార్మికులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన

PMSYM Scheme: ఈ పథకంలో చేరండి.. నెలకు రూ. 3000 పెన్షన్ పొందండి.. పూర్తి వివరాలు మీకోసం..
Money
Follow us on

PMSYM Scheme: అసంఘటిత కార్మికులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన అనే పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌ వల్ల కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో చేరిన కార్మికులకు 60 ఏళ్ల వయస్సు దాటాక.. నెలకు రూ. 3000 పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్‌లో చేరేందుకు ఇంకా అవకాశం ఉంది. కార్మికులకు మేలు చేకూర్చే ఈ స్కీమ్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పథకానికి అర్హతలేంటి..?
అసంఘ‌టిత రంగాల్లో పనిచేస్తూ నెల‌కు రూ. 15 వేల కంటే.. తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులు ప్రధానమంత్రి శ్రమ యోగి మన్‌ధన్ యోజన స్కీమ్‌కు అర్హులు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగినవారు ఈ స్కీమ్‌లో తమ పేరును నమోదు చేసుకోవచ్చు.

ఈ పథకంలో ఎలా చేరాలి..?
అర్హత కలిగిన చందాదారులు కామన్ సర్వీస్ సెంటర్స్‌(సీఎస్‌సీ)లకు వెళ్లి వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా, జన్‌ధన్ ఖాతా, ఆధార్ కార్డ్ ఉండాలి. దేశ వ్యాప్తంగా 3.13 లక్షల సీఎస్‌సీ సెంటర్లు ఉండగా.. వీటిలో ఎక్కడైనా ఈ పథకంలో చేరే అవకాశం ఉంది.

ఈ స్కీమ్‌ ఎలా ఉంటుంది..
ఈ స్కీమ్‌లో చేరిన చందాదారుడు 50 శాతం ప్రీమియం చెల్లిస్తే.. అంతేస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఒకవేళ ఈ పథకంలో చేరిన చందారుడు చనిపోతే.. అతని నామినీ(భార్య/భర్త) ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. చందాదారుడికి 60 ఏళ్లు దాటాక నెలకు రూ. 3 వేలు చొప్పున పెన్షన్ లభిస్తుంది. అయితే, మొదటి నెల చెల్లింపు జరిపిన తరువాత వారికి రశీదు ఇస్తారు. దాంతోపాటు.. ప్రత్యేక ఐడీ నంబర్లు ఉన్న కార్డులను కూడా అందిస్తారు.

మధ్యలోనే ఉపసంహరించుకుంటే..
ఈ స్కీమ్‌లో చేరిన చందాదారుడు పదేళ్ల కంటే ముందుగానే నిష్క్రమిస్తే.. అప్పటి వరకు జమ చేసిన మొత్తానికి వడ్డీతో కలిపి చెల్లిస్తారు. పదేళ్ల తరువాత అంటే 60 ఏళ్ల వయసు రాకముందే ఈ స్కీమ్ నుంచి తప్పుకున్నట్లయితే.. వడ్డీ లేదా.. పొదుపు బ్యాంకు వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది ఇస్తారు. దాంతోపాటు.. లబ్ధిదారుడి వాటా కూడా తిరిగి చెల్లిస్తారు.

Also read:

Cyberabad Police: మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చిన సైబరాబాద్ పోలీసులు.. 353 మందికి జైలు శిక్ష..

Gold Coins: బాత్రూమ్ నిర్మాణం కోసం తవ్వుతుంటే.. బంగారం బయటపడింది.. అది గుర్తించిన కూలీలు ఏం చేశారంటే..

Road Accident: మొత్తం ఏడు కార్లు.. ఒకదానిపైకి ఒకటి ఎక్కేశాయ్.. ముంబై హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్..