
1952 ఏప్రిల్ 17న మొదటిసారి స్వతంత్ర భారతదేశానికి సార్వత్రిక ఎన్నికలు జరిగి, మే 13న తొలిసారి లోక్‌సభ సమావేశమైంది. అదే రోజు ప్రధానిగా ప్రమాణం చేసిన పండిట్ నెహ్రూ 1964 మే 27… ఆఖరిశ్వాస విడిచేవరకూ పదవిలోనే ఉన్నారు. అంటే, 4 వేల 398 రోజులు నెహ్రూ జమానా నడిచింది. నెహ్రూ మరణంతో కాంగ్రెస్‌లో చీలికల సంక్షోభం వచ్చి, అనివార్య పరిస్థితుల్లో లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధానిగా ప్రమోట్ అయ్యారు. పార్టీ కుదుటపడ్డాక ఇందిరాగాంధీ చేతికి పగ్గాలొచ్చాయి. ప్రధానిగా ఆమె 1966 జనవరి నుంచి 77 మార్చి దాకా పదకొండేళ్ల రెండునెలలు ప్రధాని కుర్చీలో ఉన్నారు. కానీ, ఇందిరాగాంధీ కంటే, నెహ్రూ జమానానే దాదాపు ఏడాది ఎక్కువ. ఇప్పుడు చాచా నెహ్రూ రికార్డు కూడా చెదిరిపోయింది. మోదీ శకం మొదలయ్యాక దేశ రాజకీయ చిత్రమే పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ విముక్త భారత్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. 2014లో బిగ్గెస్ట్ పొలిటికల్ రెవెల్యూషన్‌ని చూసింది దేశం. 16వ లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన ఎన్‌డీఏ కూటమి తరఫున, మే 26న 15వ ప్రధానమంత్రిగా పదవీప్రమాణం చేశారు నరేంద్రమోదీ. తర్వాత రెండుసార్లు కూటమి ఘనవిజయం సాధించి, ప్రైమ్‌మినిస్టర్‌గా మోదీ హ్యాట్రిక్ కొట్టారు. పన్నెండేళ్ల పాటు నాన్‌స్టాప్‌గా పవర్లో...