పాలక్ పన్నీర్‌ వాసనపై రచ్చ.. ఇద్దరు భారతీయ విద్యార్ధులకు రూ.1.65 కోట్ల లాభం!

పాలక్ పన్నీర్ వంటకంపై చేసిన రగడ ఇద్దరు భారతీయ విద్యార్ధులకు ఏకంగా రూ.1.65 కోట్ల పరిహారం అందింది. పాలక్ పన్నీర్ వేడి చేయడంపై నెలకొన్న వివాదం దేశ హద్దులు దాటి వివక్ష ఆరోపణలు, పౌర హక్కుల దావాగా మారింది. దీంతో అమెరికాలో చదువుతున్న ఇద్దరు భారతీయ విద్యార్థులు కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ సుమారు రూ. 1.65 కోట్ల విలువైన పరిహారాన్ని ముట్టజెప్పింది. ఈ సంఘటన 2023 ఏడాది సెప్టెంబర్ 5న జరిగింది. ఈ వివాదం తాలూకు తీర్పు తాజాగా వెలువడటంతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

పాలక్ పన్నీర్‌ వాసనపై రచ్చ.. ఇద్దరు భారతీయ విద్యార్ధులకు రూ.1.65 కోట్ల లాభం!
palak paneer dispute at USA University

Updated on: Jan 14, 2026 | 10:48 AM

అమెరికాలోని బౌల్డర్ యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ విభాగంలో పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థి ఆదిత్య ప్రకాష్ తన ఇంట్లో తయారుచేసిన పాలక్ పనీర్‌ను తోటి స్నేహితురాలి కోసం తీసుకువచ్చాడు. అతడు మైక్రోవేవ్‌లో దానిని వేడి చేస్తున్నప్పుడు ఓ సీనియర్‌ సిబ్బంది అతని వద్దకు వచ్చి చెడు వాసన వస్తుందని ఫిర్యాదు చేశాడు. వేడి చేసేందుకు మైక్రోవేవ్‌ను ఉపయోగించవద్దని హుకూం జారీ చేశాడు. అయితే ఇది కేవలం ఆహారం మాత్రమేనని, వేడి చేసి వెళ్లిపోతానని ఆదిత్య చెప్పాడు. అయితే ఈ విషయం అంత త్వరగా తేలలేదు. ఇదే విషయంపై సీనియర్ అధ్యాపకులతో సమావేశాలకు తనను పదేపదే పిలిపించి, అవమానించినట్లు ఆదిత్య ఆరోపించాడు. ఈ చర్యలు వివక్షతతో కూడుకున్నవని భారతీయ విద్యార్థులు అన్నారు. నా ఆహారం నా గర్వం. ఏది మంచి వాసన వస్తుంది లేదా ఏది చెడు వాసన వస్తుంది అనే ఆలోచనలు సాంస్కృతికంగా నిర్ణయించబడతాయా అని అన్నారు. అంతేకాకుండా బ్రోకలీ తినడం వల్ల ఆంత్రోపాలజీ విభాగానికి చెందిన 29 మంది తోటి విద్యార్థులు భారతీయ ఆహారంపై వచ్చిన వివక్షకు మద్దతు ఇచ్చారు.

దీంతో ప్రకాష్, అతడి స్నేహితురాలు పీహెచ్‌డీ విద్యార్థిని అయిన ఊర్మి భట్టాచెర్య.. దక్షిణాసియన్ల వంటి జాతి సమూహాలపై అసమానమైన, వివక్షతతో కూడిన విధంగా డిపార్ట్‌మెంట్ వ్యవహరిస్తోందని ఆరోపించడంతో వివాదం మరింత పెరిగింది. డిపార్ట్‌మెంట్‌ చర్యలను వివక్షతతో కూడిన ప్రతీకారంగా వారు వర్ణించారు. దీంతో తామెంతో భావోద్వేగ క్షోభ, మానసిక వేదన, బాధ అనుభవించామని అన్నారు. చిరిగి చిరిగి చివరకు యూనివర్సిటీ ఈ ఇద్దరు విద్యార్థులకు వారి మాస్టర్స్ డిగ్రీలను ఇవ్వడానికి కూడా నిరాకరించింది. వీటిని సాధారణంగా పిహెచ్‌డి పూర్తి చేసే మార్గంలో డాక్టరల్ అభ్యర్థులకు ప్రదానం చేస్తారని ప్రకాష్ అన్నారు. “పిహెచ్‌డి విద్యార్థులు పిహెచ్‌డి చేసే మార్గంలో ఇచ్చే మాస్టర్స్ డిగ్రీలను మాకు ఇవ్వడానికి కూడా విభాగం నిరాకరించింది. అప్పుడే తాము చట్టపరమైన సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకాష్ అన్నారు.

దీంతో వీరితో వివక్షాపూరితంగా వ్యవహరించిన టీచింగ్ అసిస్టెంట్ తన ఉద్యోగాన్ని కోల్పోవల్సి వచ్చింది. ఆ తరువాత చాలా సందర్భాలలో క్యాంపస్‌లోని ఇతర విద్యార్ధులు భారతీయ ఆహారాన్ని తీసుకువచ్చినప్పుడు, క్యాంపస్‌లో గొడవలు జరిగాయని ఆరోపించారు. తమపై జరుగుతున్న ఈ జాత్యహంకార వివక్షను విశ్వవిద్యాలయ విద్యార్థి ప్రవర్తన కార్యాలయం కూడా పట్టించుకోలేదని వారి ఫెడరల్ పౌర హక్కుల దావాలో పేర్కొన్నారు. ఈ దావాకు ప్రతిస్పందనగా విశ్వవిద్యాలయ ప్రతినిధి డెబోరా మెండెజ్-విల్సన్ మాట్లాడుతూ.. వర్సిటీ వాదులుతో సెప్టెంబర్ 2025లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. వివక్ష, వేధింపుల ఆరోపణలను పరిష్కరించడానికి వర్సిటీ చర్యలకు ఉపక్రమించిందని, అందుకు కట్టుబడి ఉంటామని తెలిపింది. అంతేకాకుండా బాధిత విద్యార్ధులకు రూ.1.65 కోట్ల పరిహారం చెల్లించి, వారి మాస్టర్స్ డిగ్రీలను కూడా ప్రధానం చేయడానికి అంగీకరించింది. అంతేకాకుండా మరో ఇద్దరు వర్సిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. భోపాల్‌కు చెందిన ఆదిత్య ప్రకాష్, కోల్‌కతాకు చెందిన ఉర్మి భట్టాచెర్య తమ డాక్టరల్ ప్రోగ్రామ్‌ పూర్తి చేసుకుని ఈ నెల ప్రారంభంలో భారత్‌కి శాశ్వతంగా తిరిగి వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.