Viral: రౌడీ కోతి.. ఊరంతా రచ్చ.. రచ్చ.. బోన్లలో కూడా చిక్కలే.. ఫైనల్‌గా ఆడకోతితో హనీ ట్రాప్ చేయగా

|

Aug 14, 2022 | 3:01 PM

ఆ రౌడీ కోతి మాముల్ది కాదు..కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తుంది. బోన్లు పెడితే తప్పించుకుంటుంది. దీంతో అధికారులు హనీ ట్రాప్‌తో దాని తిక్క కుదిర్చారు.

Viral: రౌడీ కోతి.. ఊరంతా రచ్చ.. రచ్చ.. బోన్లలో కూడా చిక్కలే.. ఫైనల్‌గా ఆడకోతితో హనీ ట్రాప్ చేయగా
Monkey Honey Trap
Follow us on

Trending News: ఆ కోతి మాముల్ది కాదు. జనాలపై ఉత్తి పుణ్యానికే దాడి చేస్తుంది. ఇళ్లలోకి చొరబడి ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతుంది. రచ్చ రచ్చ చేస్తుంది. దీంతో జనాలు విసిగి వేసాసరిపోయారు. ఊరి నుంచి తరిమేందుకు ప్రయత్నించారు కానీ సఫలీకృతం కాలేదు. దీంతో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ చేశారు. వారు కూడా దాన్ని బోనులో బంధించేందుకు ట్రై చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో దానికి చెక్ పెట్టేందుకు ఓ క్రియేటివ్‌ థాట్‌తో ముందుకొచ్చారు. దాన్ని ఏమార్చేందుకు ఓ లేడీ మంకీని ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టారు. ఆ ఆడకోతిని చూడగానే.. కిలాడీ మగ కోతి ప్లాట్ అయిపోయింది. దాని ప్రేమలో పడిపోయింది. చివరకు దాన్ని బంధించి జనాలకు ఉపశమనం కలిగించారు. మహారాష్ట(Maharashtra) రాష్ట్రం అహ్మద్​నగర్​ డిస్ట్రిక్ట్ సంగమనేర్(Sangamner) తాలూకాలో ఈ ఘటన వెలుగుచూసింది. అక్కడ సాకుర్ అనే ఓ విలేజ్ ఉంది. ఓ కోతి ఆ గ్రామంలోని ప్రజలను హడలెత్తిస్తుంది. దాదాపు 30 మందిని అది గాయపరిచింది. ముఖ్యంగా పిల్లలపై దారుణంగా అటాక్ చేస్తుంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది రంగంలోకి దిగారు. చాలా చోట్ల బోన్లు ఏర్పాట్లు చేసినప్పటికీ అది చిక్కలేదు.

దీంతో ఆడకోతిని రంగంలోకి దించారు. దీంతో ఠారెత్తిస్తున్న మగ కోతి ట్రాప్‌లో పడింది. ఆడ కోతితో సన్నిహితంగా మెలిగేందుకు ఆ మగ కోతి ఆ ప్రాంతానికి వచ్చింది. ఈ క్రమంలోని దానికి మత్తు మందు ఇచ్చారు అధికారులు. ఆ తర్వాత కూడా అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. పక్కనే ఉన్న వాగులోకి దూకేసింది. వెంటనే అలర్టైన సిబ్బంది.. వాగులోకి దూకి ఆ రౌడీ కోతిని బంధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి