హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు తెరిచేందుకు హోం శాఖ గ్రీన్ సిగ్నల్

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గుంపులు గుంపులుగా ఏర్పడటం వల్ల కరోనా వ్యాప్తి వేగం పెరుగుతుందన్న కారణంతో..

హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు తెరిచేందుకు హోం శాఖ గ్రీన్ సిగ్నల్
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 5:26 PM

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గుంపులు గుంపులుగా ఏర్పడటం వల్ల కరోనా వ్యాప్తి వేగం పెరుగుతుందన్న కారణంతో.. అనేక వాటిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే గత నెల నుంచి మెల్లిమెల్లిగా కొన్నింటిపై ఆంక్షలను సడలిస్తుంది కేంద్రం. అందులో భాగంగా తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాళ్లను తెరుచుకునేందుకు హోంశాఖ షరతులతో కూడిన అనుమతులనిచ్చింది. 50 శాతం మాత్రమే సామర్ధ్యంతో తెరవాలని.. ఆరోగ్య సూత్రాలను పాటించాలని.. సోషల్ డిస్టెన్స్‌, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలిపింది. ఈ పరిశ్రమ వర్గాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీటికి వెసులుబాటు కల్పించినట్లు పేర్కొంది.