Amit Shah: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన రద్దు

|

Jan 30, 2021 | 11:31 AM

ఢిల్లీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల పశ్చిమ బెంగాల్‌ పర్యటన రద్దయింది. ఓ వైపు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు, ఇజ్రాయిల్‌ ఎంబసీ వద్ద పేలుడు..

Amit Shah: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన రద్దు
Follow us on

Amit Shah West Bengal tour cancel: ఢిల్లీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల పశ్చిమ బెంగాల్‌ పర్యటన రద్దయింది. ఓ వైపు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు శుక్రవారం ఢిల్లీలోని ఇజ్రాయిల్‌ ఎంబసీ వద్ద పేలుడు జరిగింది. అంతేకాకుండా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయాలని సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లోని ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో రైతుల ఉద్యమ ఎప్పుడు ఏ విధంగా రూపాంతరం చెందుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజా పరిణామాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిశితంగా పరిశీలిస్తున్నారని హోంశాఖ వర్గాలు శనివారం తెలిపాయి. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలోనే రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ రిపబ్లిక్‌ డే ముగింపు వేడుకలు బీటింగ్‌ రిట్రీట్‌‌కు హాజరయ్యారు. దీంతో ఈ పేలుడు ఘటన.. ఢిల్లీలో తాజా పరిస్థితులపై హోంశాఖ నిశితంగా పరిశీలిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి.

బెంగాల్‌లో త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. అంతకుముందు పర్యటించిన అమిత్ షా.. నెలకొసారి బెంగాల్‌లో పర్యటిస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో అమిత్‌ షా రెండు రోజులపాటు బెంగాల్‌‌లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటనలో ఇస్కాన్ టెంపుల్‌ను ప్రారంభించడంతో పాటు పరగణ జిల్లాలో ఠాకూర్‌బారి మైదానంలో, హౌరాలో జరిగే బీజేపీ బహిరంగలో పాల్గొనాల్సి ఉంది. అలాగే కోల్‌కతాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.

Also Read: