ఉత్తరాదిని కప్పేసిన మంచు దుప్పటి.. పలు చోట్ల రహదారుల మూసివేత..

|

Mar 04, 2024 | 11:46 AM

ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది..హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లలో హిమపాత బీభత్సం కొనసాగుతూనే ఉంది. రెండు రోజలుగా దట్టమైన మంచు కురుస్తుండటంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.పెద్ద సంఖ్యలో రహదారులను మూసివేయడంతో..

ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది..హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లలో హిమపాత బీభత్సం కొనసాగుతూనే ఉంది. రెండు రోజలుగా దట్టమైన మంచు కురుస్తుండటంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.పెద్ద సంఖ్యలో రహదారులను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..హిమాచల్‌లో లాహౌల్‌, స్పితి సహా మరికొన్ని ప్రాంతాల్లో దట్టమైన మంచు కారణంగా ఐదు జాతీయ రహదారులు సహా 650 రోడ్లను మూసివేశారు..

మరోవైపు జమ్మూకశ్మీర్‌లోనూ పెద్ద ఎత్తున మంచు కురుస్తుంది..గుల్‌మార్గ్‌లోని స్కై రిసార్ట్‌, సోనామార్గ్‌, దూధ్‌పత్రిలలో మంచు కురుస్తుంది.. రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు..బలమైన గాలులు వీయటంతో అనంత్‌నాగ్‌ జిల్లాలో అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి..నౌగమ్‌ గ్రామంలో ఇళ్ల పైకప్పులు, దుకాణాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు..ఐతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు..

Follow us on