Watch Video: ముంచెత్తిన వరదలు.. నీట మునిగిన టోల్‌ప్లాజా.. ఎక్కడో తెలుసా?

గత వారం రోజులుగా ఉత్తరాదిని వర్షాలు ముచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదలు, వాగులు పొంగిపోర్లు తున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో బీయాస్‌ నది వరద ప్రవాహనంలో మనాలిలోని రైసన్ టోల్‌ ప్లాజా నీటమునిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch Video: ముంచెత్తిన వరదలు.. నీట మునిగిన టోల్‌ప్లాజా.. ఎక్కడో తెలుసా?
Himachal Rains

Updated on: Aug 27, 2025 | 7:03 PM

ఉత్తరాదిని వర్షాలు ముచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లోని లోతట్టు ప్రాంతాలు మొత్తం నీటి మునిగాయి. నదులు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తాన్నాయి. ఈ క్రమంలోనే బియాస్‌ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం మనాలిలోని రైసన్ టోల్‌ ప్లాజాను ముంచెత్తింది. వరద ఉధృతికి టోల్‌ ప్లాజా నీట మునగడంతో పాటు, చాలా ప్రాంతాల్లో రోడ్డు కూడా కొట్టుకుపోయింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న నివాసాలు మొత్తం నీటమునిగాయి. పురాతన భయనాలు నేలకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే మనాలి టోల్‌ ప్లాజా నీటిలో కొట్టుకుపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఈ వీడియో కొన్న వాహనాలు నీటిలో చిక్కుకుపోవడం కూడా మన చూడవచ్చు. కాగా సోమవారం సాయంత్రం నుండి రాష్ట్రంలో 12 ఆకస్మిక వరదలు, రెండు పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఈ సంఘటనలలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.