Karnataka Hijab Row: మతం అంటే కలిపేదే కానీ..విడదేసేది కాదు అంటూ చెప్పాల్సిన రాజకీయం.. ఇంకా రాజకీయమే చేస్తుంటే.. ఆ పసిమనసుల్లో విషబీజాలు నాటుకోవా..? అసలు విద్యాలయాల్లో యూనిఫాంలు(Uniform) ఎందుకు పెడతారో తెలుసుగా.. వివక్ష లేకుండా.. వర్ణవివక్షకు తావు లేకుండా.. కులమత బేధం చూడకుండా.. మతసామరస్యానికి ప్రతీకగా.. సమతాభావాలకు అర్థం వచ్చేలా మేమంతా ఒక్కటే….అని చెప్పే ఒకే ఒక నిలయం…మన విద్యాలయం.. కానీ కర్నాటక(Karnataka)లో ఏం జరుగుతోంది. నిండా పదిహేనేళ్లు కూడా నిండని విద్యార్ధులు.. ఇంతలా వేర్పాటు వాదం చేసేందుకు కారణమేవరు..? రోజురోజుకూ హిజాబ్ వివాదం(Hijab Controversy) ఇంతలా ముదిరిపోవడానికి కారకులెవరు..? హిజాబ్ వివాదంపై…ప్రస్తుతం కర్నాటక కోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై కోర్టు తీర్పు రావాల్సి ఉంది.
కర్ణాటకలో హిజాబ్ ధరించడంపై అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 1న హిజాబ్ దినోత్సవం నిర్వహించారు. ఈ దినోత్సవం తర్వాత వివాదం ఇంకా ముదిరింది. చాలామంది ముస్లిం మహిళలు హిజాబ్‌కు అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహించారు. ఇంతలో కర్నాటకలోని మాండ్యాలోని కళాశాలలో హిజాబ్‌ని అనుమతించాలని అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ దూసుకొచ్చిందో బాలిక.. అంత దైర్యం ప్రదర్శించిన ఆ బాలిక శెభాష్ అనిపించొచ్చు…ఆమె తెగువకు సలాం కొట్టొచ్చు…కానీ ఇంతలోనే జైశ్రీరామ్ నినాదాలు….విద్యార్ధుల మెడలో కాషాయకండువాలు…పుట్టుకొచ్చాయి. అందుకు తగ్గట్టే జై భీం స్లోగన్సూ తోడుయ్యాయి. జైశ్రీరాం…సై హిజాబ్..మధ్యలో జై భీమ్…ఇంకేముంది ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది…వీధులకెక్కి స్టూడెంట్స్ రాళ్లు రప్పలతో దాడులు చేసుకునేదాకా వచ్చింది పరిస్థితి. ఇక రాజకీయం తనపని తాను చేసుకుపోతోంది. కానీ తాజా వివాదానికి కారణం ఉపాధ్యాయుల తీరేనంటున్నారు విశ్లేషకులు.
హిజాబ్ ధరించిన బాలికలను వేరుగా కూర్చోబెట్టడం, వారిని కాలేజ్‌ల్లోకి అనుమతించకపోవడంతో వారిలో ఇంకా ఆగ్రహావేశాలు తన్నుకొచ్చాయని…ఆ ఆగ్రహంలో నుంచి పుట్టిందే ఆ బాలిక నినాదమంటున్నారు ప్రజాసంఘాల నేతలు. అదే ఉపాధ్యాయులు విద్యార్ధుల పట్ల ప్రేమగా ఉండి…నిదానంగా సర్ది చెప్పి ఉంటే సరిపోయేదని…కోర్టు తీర్పు తర్వాత వారు అర్థం చేసుకునే వారని..విషయం ఇందాకా వచ్చిందంటే….ఆయాకాలేజీల యాజమాన్యం ఎందాకా వెళ్లిందో గమనించాలంటున్నారు ప్రజాసంఘ నేతలు. ఇందదులోకి రాజకీయం కూడా ఎంటర్ కావడంతో…హిజాబ్ కాస్తా స్టేట్ నుంచి నేషనల్ లెవల్‌కు ఎదిగిపోయింది. రాహుల్ గాందీ నుంచి మన పాతబస్తీ బడేమియా వరకు విద్యార్దులను విడదీసి మరి సపోర్ట్ ఇస్తున్నారు నేతశ్రీలు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తగ్గేదే లేదని, తెగించి పోరాడమంటూ పిలుపునిచ్చారు…
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావోద్వేగాలతో పనిలేదని..రాజ్యాంగంతోనే పని అని…రాజ్యాంగం ప్రకారం ఎలా నిర్ణయం తీసుకోవాలో..అలాగే తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు హిజాబ్ వివాదంపై చర్చకు పట్టుబట్టడంతో స్పీకర్ తిరస్కరించారు. దీంతో విపక్షాలు వాకౌట్ చేశాయి. యూపీ ఎన్నికల నేపధ్యంలోనే దీన్ని మరింత సాగదీస్తున్నారన్నది లోకల్‌గా వినిపిస్తున్న మాట..నిండుదనంతో ఉండే తమ మత సంప్రదాయాలను గౌరవించడం మానేసి….అర్థనగ్నంగా నటించేవారికి అవార్డులిచ్చేవారిని ఏమనాలంటూ టీవీ9 డిస్కషన్‌లో అయోషా అనే మహిళ వినిపిస్తున్న ప్రశ్న.
ప్రస్తుతం కర్నాటకలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో విద్యాసంస్థలు మూడురోజులపాటు సెలవులు ప్రకటించారు. మొత్తానికి హిజాబ్ వివాదం చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అసలు స్కూల్ రూల్స్ బుక్‌లో హిజాబ్ నిషేదం అని ఎక్కడా చెప్పలేదని….స్కార్ప్ లాంటివాటికి అనుమతి ఇచ్చారని…అయినా ఇంత సడెన్‌గా హిజాబ్‌పై ఎందుకు ఆంక్షలు పెట్టారో అర్థం కావడంలేదంటూ హిజాబ్ మద్దతుదారులు అడుగుతున్న ప్రశ్న. ఇలాంటి సున్నిత అంశాల్లో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని.. తెలిసీ తెలియని వయసులో ఆవేశం తప్ప ఆలోచనతో కూడిన అనుభవం లేని పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఏది తప్పో..జరుగుతున్న వివాదం ఎందాకా తీసుకెళ్తుందో…ఇంట్లో పెద్దలైనా…క్లాసులో గురువులైనా….ప్రేమను చూపే ఆత్మీయులైనా ఆ పసిపిల్లలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది.
అయినా పిల్లలూ మన సంప్రదాయం గొప్పదే…కానీ అంతకన్నా సమానత్వం ఇంకా ఉన్నతమైనది…ఆవేశంతో కాదు..ఆలోచన చేయండి…ఇది మన భారతం…మన ఒంట్లో ఉన్నది మతం రంగు కాదు….మూడురంగులపంచిన సమతాభావం. కాస్త ఆలోచించండి రేపటి మన భావి భారత పౌరులారా….భరతమాత ముద్దబిడ్డలారా…
Read Also…. Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ మంచివాడే, కానీ.. ఆయన టీమ్ జోక్యం సరికాదు.. కీలక వ్యాఖ్యలు చేసిన టీఎంసీ