Odisha: నిజంగా నీకు సెల్యూట్ అన్నా.. దానా తుఫాన్ బీభత్సానికి ఎదురెళ్లి

దానా తుఫాన్ ఒడిశాను అతలాకుతలం చేసింది. వర్ష బీభత్సానికి రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను 2 కిలో మీటర్లు అంబులెన్స్‌ డ్రైవర్‌ మోసుకెళ్లిన ఘటన కేంద్రాపడా జిల్లాలో జరిగింది.

Odisha: నిజంగా నీకు సెల్యూట్ అన్నా.. దానా తుఫాన్ బీభత్సానికి ఎదురెళ్లి
Ambulance Driver

Updated on: Oct 27, 2024 | 9:30 PM

ఒడిశాలో ఇటీవల దానా తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ కారణంగా 14 జిల్లాల్లో భారీ వరదలతో 35 లక్షల మంది ప్రజలు ప్రభావితమైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. వరదల కారణంగా దాదాపు 5 వేల 840 ఇళ్లు దెబ్బతిన్నాయని.. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఈసారి శాశ్వత పరిష్కారం చూపి దశల వారీగా శాశ్వత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి ఆహారం, ఇతర అవసరమైన వస్తువులను అధికారులు అందజేస్తున్నారు.

మరోవైపు కేంద్రాపడా జిల్లాలోని మారుమూల గ్రామంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి తరలించాల్సి ఉండగా.. వర్ష బీభత్సానికి రాకపోకలు జరిపే అవకాశం లేకపోవడంతో బాధితురాలి ఇంటి వరకు అంబులెన్స్‌ వెళ్లలేకపోయింది. ఈ క్రమంలో అంబులెన్స్‌ డ్రైవర్‌.. విపత్కర పరిస్థితుల్లోనే మహిళ ఇంటి వరకు వెళ్లి.. 2 కిలో మీటర్లు కాలినడకన మోసుకొచ్చి అంబులెన్స్‌ వద్దకు చేర్చాడు. అనంతరం అత్యవసర చికిత్స అందించి.. ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా అంబులెన్స్ డ్రైవర్ చేసిన  గొప్ప పనికి.. అందరూ అతడ్ని కొనియాడుతున్నారు.