బ్రేకింగ్… తమిళనాడులో ఘోర ప్రమాదం.. భారీ వర్షాల ధాటికి….

| Edited By: Srinu

Dec 02, 2019 | 4:57 PM

తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా నాలుగు భవనాలు కూలిపోగా సుమారు 15 మంది మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో చాలామంది నిద్రలో ఉన్నట్టు సమాచారం. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై, మదురై, కాంచీపురం, కడలూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాలు దాదాపు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక చోట్ల స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. […]

బ్రేకింగ్... తమిళనాడులో ఘోర ప్రమాదం.. భారీ వర్షాల ధాటికి....
Follow us on

తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా నాలుగు భవనాలు కూలిపోగా సుమారు 15 మంది మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో చాలామంది నిద్రలో ఉన్నట్టు సమాచారం. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై, మదురై, కాంచీపురం, కడలూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాలు దాదాపు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక చోట్ల స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఇలాగే పడవచ్ఛునని వాతావరణ శాఖ ప్రకటించింది. చెన్నైలో పలు చోట్ల మురుగునీరు ప్రవహిస్తోంది. పుదుచ్ఛేరి సైతం వర్షాలతో సతమతమవుతోంది.