చార్‌ధామ్‌ యాత్రీకులకు బ్రేకింగ్‌ న్యూస్‌..! 24 గంటల పాటు యాత్ర నిలిపివేసిన అధికారులు..

ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు ఛార్‌ధామ్‌ యాత్రకు వస్తుంటారు. ఈసారి కూడా ఇప్పటికే చాలామంది దివ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. అయితే, భద్రతా కారణాల వల్ల యాత్రికులను హరిద్వార్, రిషికేశ్‌, శ్రీనగర్‌, రుద్రప్రయాగ్‌, సోన్‌ప్రయాగ్‌, వికాస్‌నగర్‌ వంటి ముఖ్య పట్టణాల్లో నిలిపివేయాలని పోలీసులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

చార్‌ధామ్‌ యాత్రీకులకు బ్రేకింగ్‌ న్యూస్‌..! 24 గంటల పాటు యాత్ర నిలిపివేసిన అధికారులు..
Chardham Yatra

Updated on: Jun 29, 2025 | 1:54 PM

ఉత్తరాఖండ్‌లో భారీవర్షాల కారణంగా చార్‌ధామ్‌ యాత్రను 24 గంటల పాటు నిలిపివేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరిద్వార్, రిషికేశ్‌, శ్రీనగర్‌, రుద్రప్రయాగ్‌, సోన్‌ప్రయాగ్‌, వికాస్‌ నగర్‌ వద్ద యాత్రికులను ఆపాలని ఆదేశించింది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్‌ సంభవించింది. దీని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. బార్‌కోట్‌-యుమునోత్రి మార్గంలో ఆకస్మిక వరదలు కూడా సంభవించాయి. దీని కారణంగా కొండ ప్రాంతాల్లో మట్టి క్షీణత, రోడ్డుపై కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ప్రతి ఏటా లక్షలాదిమంది భక్తులు ఛార్‌ధామ్‌ యాత్రకు వస్తుంటారు. ఈసారి కూడా ఇప్పటికే చాలామంది దివ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. అయితే, భద్రతా కారణాల వల్ల యాత్రికులను హరిద్వార్, రిషికేశ్‌, శ్రీనగర్‌, రుద్రప్రయాగ్‌, సోన్‌ప్రయాగ్‌, వికాస్‌నగర్‌ వంటి ముఖ్య పట్టణాల్లో నిలిపివేయాలని పోలీసులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..