Himachal Weather: హిమాచల్‌లో భారీ నష్టం.. శిథిలాల కింద ఇంకా 13 మంది.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి వినతి..

|

Aug 17, 2023 | 8:46 AM

గత మూడు రోజుల్లో 71 మంది చనిపోయారని, 13 మంది ఆచూకీ తెలియలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. అదే సమయంలో ఆదివారం రాత్రి నుండి 57 మృతదేహాలను వెలికితీశారు. అదే సమయంలో హిమాచల్‌లో భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలను సరిచేయడానికి ఒక సంవత్సరం పడుతుందని సిఎం సుఖు చెప్పారు.

Himachal Weather: హిమాచల్‌లో భారీ నష్టం.. శిథిలాల కింద ఇంకా 13 మంది.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి వినతి..
Himachal Weather
Follow us on

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా గత మూడు రోజుల్లో ఇప్పటివరకు 71 మంది మరణించారు. అదృశ్యమైన 13 మంది జాడ తెలియాల్సి ఉంది. పర్వతాల మీద మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంలో సవాలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు అన్నారు. మీడియా నివేదికల ప్రకారం సిమ్లాలోని సమ్మర్ హిల్ సమీపంలోని శివాలయం శిధిలాల నుండి మరొక మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన 57 మంది మృతదేహాలను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా కూలిపోయిన భవనాల శిథిలాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిమ్లాలోని సమ్మర్ హిల్, కృష్ణ నగర్, ఫాగ్లీ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

గత మూడు రోజుల్లో 71 మంది మృతి

గత మూడు రోజుల్లో 71 మంది చనిపోయారని, 13 మంది ఆచూకీ తెలియలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ (రెవెన్యూ) ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. అదే సమయంలో ఆదివారం రాత్రి నుండి 57 మృతదేహాలను వెలికితీశారు. అదే సమయంలో హిమాచల్‌లో భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలను సరిచేయడానికి ఒక సంవత్సరం పడుతుందని సిఎం సుఖు చెప్పారు. 10,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రస్తుతం తమ ముందు గట్టి సవాల్ ఎదురైందని అన్నారు.

ఇవి కూడా చదవండి

సహాయక చర్యలు ముమ్మరం

సమ్మర్ హిల్, కృష్ణా నగర్ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇక్కడి నుంచి మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు. సమ్మర్‌హిల్‌లో ఇప్పటివరకు 13, ఫగ్లీలో ఐదు, కృష్ణానగర్‌లో రెండు మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన తెలిపారు. సోమవారం శివాలయంలో కొండచరియలు విరిగిపడిన శిథిలాల కింద ఇంకా 10 మంది సమాధి అయ్యి ఉండవచ్చు అని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు

అదే సమయంలో కృష్ణానగర్‌లో దాదాపు 15 ఇళ్లను ఖాళీ చేయించి కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడతాయనే భయంతో పలువురును ఇళ్లను ఖాళీ చేయించారు. దీనితో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు, హిమాచల్ విశ్వవిద్యాలయం ఆగస్టు 19 వరకు విద్యా కార్యకలాపాలను నిలిపివేసింది.

మూతపడిన 800 రోడ్లు

రాష్ట్రంలో దాదాపు 800 రోడ్లు మూసుకుపోయాయని.. జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు రూ.7,200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపినట్లు సమాచారం. అంతకుముందు  జూలైలో రాష్ట్రంలోని మండి, కులు, సిమ్లాతో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. అనేక మంది మరణించారు. కోట్లాది రూపాయల ఆస్తికి నష్టం వాటిల్లింది. హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని.. దెబ్బతిన్న నిర్మాణాల సహాయ, మరమ్మత్తు పనుల కోసం 2,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి కేంద్రాన్ని అభ్యర్థించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..