గవర్నర్ రెండో ప్రేమలేఖ తీవ్రంగా బాధించింది : కుమారస్వామి

| Edited By:

Jul 19, 2019 | 5:49 PM

ఇవాళ సాయంత్రం 6.00 గంటల్లోగా విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోవాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ తనకు రాసిన రెండో లేఖపై సీఎం కుమారస్వామి స్పందించారు. తాజా పరిణామాలు తనను వేదనకు గురిచేస్తున్నాయని వాపోయారు. నేను గవర్నర్‌ను గౌరవిస్తానని.. అయితే ఆయన రెండో లేఖ రాయడం నన్ను చాలా బాధించిందని అన్నారు. కేవలం 10 రోజుల క్రితమే ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారం నాకు తెలిసిందని కుమారస్వామి తెలిపారు. ఇండిపెండెండ్ ఎమ్మెల్యే ఎన్.నగేష్‌తో కలిసి బీఎస్ యడ్యూరప్ప పీఏ సంతోష్ […]

గవర్నర్ రెండో ప్రేమలేఖ తీవ్రంగా బాధించింది : కుమారస్వామి
Follow us on

ఇవాళ సాయంత్రం 6.00 గంటల్లోగా విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోవాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ తనకు రాసిన రెండో లేఖపై సీఎం కుమారస్వామి స్పందించారు. తాజా పరిణామాలు తనను వేదనకు గురిచేస్తున్నాయని వాపోయారు. నేను గవర్నర్‌ను గౌరవిస్తానని.. అయితే ఆయన రెండో లేఖ రాయడం నన్ను చాలా బాధించిందని అన్నారు. కేవలం 10 రోజుల క్రితమే ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారం నాకు తెలిసిందని కుమారస్వామి తెలిపారు. ఇండిపెండెండ్ ఎమ్మెల్యే ఎన్.నగేష్‌తో కలిసి బీఎస్ యడ్యూరప్ప పీఏ సంతోష్ విమానం ఎక్కుతున్న ఫోటోను ఇందుకు నిదర్శనమంటూ కుమారస్వామి ఆ ఫోటోను ప్రదర్శించారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని, అమెరికా వెళ్లొద్దని చాలా మంది నాతో చెప్పారని.. అయితే అన్నింటికంటే నన్ను గాయపరిచిన విషయం ఏమిటంటే గవర్నర్ రెండో లేఖ రాయడమని కుమారస్వామి అన్నారు.