ఓటరు గుర్తింపు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. బీఎల్‌ఓ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్‌ను లింక్ చేస్తున్నారు. మరోవైపు ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఈ పని చేయలేరు. అందుకే ఓటరు గుర్తింపుకార్డును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఇది కాకుండా, పాఠశాల-కళాశాల నుంచి బ్యాంకు వరకు ఓటరు ID కార్డు అవసరం. ఓటింగ్ కోసం ఓటర్ ID ఉపయోగించబడుతుంది. అయితే, మీరు ఇప్పటికే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, మీరు ఓటరు ID కార్డును ఎలా ట్రాక్ చేయవచ్చు.. దాని స్థితిని ఎలా తెలుసుకోవచ్చో ఇక్కడ మనం తెలుసుకుందాం. అలాగే, మీ ఓటరు ID కార్డ్ రెడీ అయిన తర్వాత మీకు ఎప్పుడు చేరుతుందో కూడూా తెలుసుకుందాం.
మీరు ఓటరు ID కార్డ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే.. మీరు సర్టిఫికేట్ రూపంలో కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. దీన్ని పూర్తి చేయడానికి.. మీరు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ లేకపోయినా.. మీరు ఎలక్ట్రిక్ బిల్లు నుంచి ఓటర్ ఐడి కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం