కరోనాతో హర్యానా మొదటి మహిళా ఎంపీ చంద్రావతి దేవి కన్నుమూత

| Edited By:

Nov 16, 2020 | 8:09 AM

హర్యానా మొట్టమొదటి మహిళా ఎంపీ, పుదుచ్ఛేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌ చంద్రావతి దేవి(92) ఇక లేరు. కరోనా బారిన పడ్డ ఆమె ఈ నెల 5న రోహతక్‌ పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్

కరోనాతో హర్యానా మొదటి మహిళా ఎంపీ చంద్రావతి దేవి కన్నుమూత
Follow us on

MP Chandrawati Devi: హర్యానా మొట్టమొదటి మహిళా ఎంపీ, పుదుచ్ఛేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌ చంద్రావతి దేవి(92) ఇక లేరు. కరోనా బారిన పడ్డ ఆమె ఈ నెల 5న రోహతక్‌ పోస్ట్ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేరగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు కరోనా నిబంధనల ప్రకారం దాద్రీ జిల్లాలోని దలవాజ్‌ గ్రామంలో వైద్యులు నిర్వహించారు. కాగా 1977లో జనతా పార్టీ నుంచి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రావతి గెలిచి ఎంపీ అయ్యారు. దీంతో హర్యానాకు మొదటి మహిళా ఎంపీగా చంద్రావతి రికార్డు సాధించారు. మరోవైపు ఆమె మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు