Minister Anil Vij: హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీ గుండా ఫరీదాబాద్ వస్తున్న ఓ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దొంగించి తీసుకెళ్లిందని ఆరోపించారు. ఇప్పటి నుంచి హర్యానా రాష్ట్రానికి వస్తున్న అన్ని ఆక్సిజన్ సిలిండర్ల వాహనాలకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించామని చెప్పారు.
అనిల్ విజ్ బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, హర్యానాలోని ఫరీదాబాద్‌కు అత్యవసరంగా ఆక్సిజన్ ట్యాంకర్లు వస్తున్నాయి. అయితే, చెకింగ్ పేరుతో ఒక ట్యాంకర్‌ను ఆపిన ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం దొంగతనం చేసిందని ఆక్షేపించారు. ఇకపై అన్ని ట్యాంకర్లకు పోలీసు రక్షణ ఉండాలని ఆదేశించానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే, ఇక ఆరోగ్య సంరక్షణ రంగంలోని మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని అనిల్ విజ్ దుయ్యబట్టారు.
ప్రస్తుతం హర్యానా హోం మంత్రిగా కూడా అనిల్ విజ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం గమనార్హం. హర్యానాకు ఆక్సిజన్ తగిన స్థాయిలో ఉందని, ఢిల్లీకి ఆక్సిజన్‌ను పంపించడానికి సుముఖంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే, రాష్ట్ర అవసరాలను తీర్చుకున్న తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. ‘‘మా ఆక్సిజన్‌ను ఢిల్లీకి ఇవ్వాలని మాపై ఒత్తిడి వస్తోంది’’ అని వెల్లడించారు. కాగా, హర్యానా మంత్రి ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించలేదు.
We are being forced to give our oxygen to Delhi. First, we’ll complete our needs, then give to others. Yesterday, one of our O2 tankers was looted by Delhi Govt that was going to Faridabad. From now, I’ve ordered police protection for all tankers: Haryana Health Min Anil Vij pic.twitter.com/mJ7GPmGTqm
— ANI (@ANI) April 21, 2021
అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి కరోనా బాధితులు ప్రాణాలను కోల్పోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటుంది. కోవిడ్ -19 రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయలేకపోతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే, ఆక్సిజన్ సిలిండర్లను ఢిల్లీలోని ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు అనిల్ విజ్ ఆరోపించారు.
ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రికి 4500 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ లభించగా, లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రికి 10 టన్నుల ఆక్సిజన్ లభించిందని వార్తా సంస్థ ఎఎన్‌ఐ పేర్కొంది. “ప్రస్తుత పరిస్థితికి ఈ సరఫరా సరిపోతుంది” అని ఎల్ఎన్జెపి ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు.
అలాగే, అనిల్ విజ్ రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ స్థితి గురించి మాట్లాడారు. కోవిడ్ -19 చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ డ్రగ్ రెండు డిపోలు ఉన్నాయని చెప్పారు. డ్రగ్ డిపార్‌మెంట్ అధికారులతో ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నట్లు అయన తెలిపారు. ప్రతి సీసా కదలికను నమోదు చేస్తున్నామన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఇచ్చే ముందు రసాయన శాస్త్రవేత్తలకు ఆధార్ కార్డును తనిఖీ చేయాలని ఆదేశించామన్నారు.
అటు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) మరియు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కూడా తమ శుద్ధి కర్మాగారాలలో ఉత్పత్తి చేయబడిన ఆక్సిజన్‌ను COVID-19 చేత తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో వైద్య ఆక్సిజన్ లభ్యతను భర్తీ చేయడానికి ప్రారంభించాయి.
మరోవైపు, కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత ఉన్నదని ఫిర్యాదులు చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆక్సిజన్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అయితే, ఇండియాలో అతిపెద్ద ఆక్సిజన్ తయారీదారు ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. దేశంలోని మెడికల్ ఆక్సిజన్ మార్కెట్‌లో 50 శాతం ఈ సంస్థే తయారు చేస్తుంది. అయితే ప్రస్తుతం దేశానికి అవసరమైనంత ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని ఐనాక్స్ ఎయిర్ ప్రోడక్ట్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ చెప్పారు.
ఢిల్లీ, హర్యానా మరియు పంజాబ్‌లోని వివిధ ఆసుపత్రులకు ఎటువంటి ఖర్చు లేకుండా 150 టన్నుల ఆక్సిజన్ సరఫరాను ప్రారంభించినట్లు ఐఓసి తెలిపింది. విడిగా, బిపిసిఎల్ 100 టన్నుల ఆక్సిజన్‌ను ఎటువంటి ఖర్చు లేకుండా సరఫరా చేయడం ప్రారంభించిందని తెలిపింది. సాధారణంగా చమురు శుద్ధి కర్మాగారాల్లో నత్రజని ఉత్పత్తిలో భాగంగా పారిశ్రామిక ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తారు. అయితే, ఇవి. పరిమిత పరిమాణాన్ని ఉత్పత్తి చేయగలవు. కానీ కార్బన్ డయాక్సైడ్ వంటి ఇతర వాయువులను స్క్రబ్ చేయడం ద్వారా దీనిని 99.9 శాతం స్వచ్ఛతతో వైద్య వినియోగ ఆక్సిజన్‌గా మార్చవచ్చు.
Read Also.. Vaccine for Eighteen: పద్దెనిమిది ఏళ్లకు టీకా..అమూల్ టచ్ తో ప్రచారం..అదిరింది అంటున్న నెటిజనం!