
గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ బాస్కెట్‌బాల్ హూప్ పోల్ మీద పడి ఓ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హరియాణాలోని రోహ్‌తక్‌లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కోర్టులో ఉన్న ఇతర క్రీడాకరులు అతన్ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.. కానీ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానిరి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహ్‌తక్‌కు చెందిన లఖన్ అనే జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు తన గ్రామంలోని స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బంతిని గోల్ వేసి.. బాస్కెట్‌బాల్ హూప్‌ను పట్టుకొని వేలాడాడు.. దీంతో ఒక్కసారిగా పోల్ విరిగి లఖన్ పై పడిపోయింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే గ్రౌండ్‌లో ఉన్న తోటి క్రీడాకారులు లఖన్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ లఖన్ మృతి చెందాడు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్‌గా మారాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
వీడియో చూడండి..
#रोहतक-यह वीडियो #हरियाणा के #रोहतक का है जहाँ एक 16 वर्षीय बास्केटबॉल के खिलाड़ी की पोल के नीचे दबने से दर्दनाक मौत हो गई,घटना का सीसीटीवी फुटेज आया सामने,16 वर्षीय हार्दिक बास्केटबॉल ग्राउंड में प्रक्टिक कर रहा था pic.twitter.com/TnX1PPAhS3
— Sahil Rukhaya (@Sahilrukhaya7) November 26, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.