
వాతావరణంలో మార్పులు, వర్షాకాల ప్రభావంతో హెచ్1ఎన్1 (H1N1 – Swine Flu) ఇన్ఫెక్షన్లు వేగంగా విస్తరిస్తున్నాయి. సాధారణ జలుబు, ఇన్ఫ్లుయెంజాలా కనిపించే ఈ వైరస్ కొందరిలో తీవ్రమై శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తోంది. దీంతో ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలి, ఏ సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు అనే అంశాలపై వైద్య నిపుణులు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు.
సాధారణ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. అయితే కింద పేర్కొన్న హై-రిస్క్ వర్గాల వారికి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడం మంచిది. ఆస్తమా, సీఓపీడీ, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం లేదా కిడ్నీ వ్యాధులు ఉన్నవారు. 65 ఏళ్లు పైబడినవారు, 5 ఏళ్ల లోపు పిల్లల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం ఎక్కువ. గర్భధారణ సమయంలో స్వైన్ ఫ్లూ సోకితే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. జ్వరంతో పాటు తీవ్రమైన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వారికి సరైన చికిత్స అందించడానికి పరీక్షలు తప్పనిసరి.
ఫ్లూ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారే అవకాశం ఉన్న హై-రిస్క్ గ్రూపుల వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చిన్న పిల్లలు (6 నెలల నుండి 5 ఏళ్ల వరకు): రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందని పిల్లల్లో ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తాయి.
వయోవృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు): వయస్సు పెరిగే కొద్దీ వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వీరికి నివారణ టీకా చాలా అవసరం.
గర్భిణీ స్త్రీలు: గర్భధారణ సమయంలో మహిళల్లో శ్వాసకోశ, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి ఫ్లూ షాట్ సురక్షితమైన రక్షణనిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు: ఆస్తమా, సీఓపీడీ, గుండె జబ్బులు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఆరోగ్య సంరక్షణ సిబ్బంది: నిరంతరం రోగుల సంరక్షణలో ఉండే డాక్టర్లు, నర్స్‌లు తదితరులు వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి.
అవును, వార్షిక ఫ్లూ టీకా తీసుకోవడం ద్వారా H1N1, ఇతర ఇన్ఫ్లుయెంజా రకాల నుండి బలమైన రక్షణ లభిస్తుంది. ప్రతి సంవత్సరం వైరస్ తన రూపాంతరాన్ని మార్చుకుంటూ ఉండటం వల్ల ఏటా కొత్త ఫ్లూ షాట్ తీసుకోవడం అవసరం. ఇన్ఫ్లుయెంజా వైరస్‌లు తరచూ తమ రూపాంతరాలను మార్చుకుంటూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్న వైరస్ స్ట్రెయిన్ల ఆధారంగా కొత్త ఫ్లూ వ్యాక్సిన్‌ను నవీకరిస్తుంది. కాబట్టి, ప్రతీ ఏడాదీ కొత్త షాట్ తీసుకోవడం వల్ల మాత్రమే సరైన నిరోధక శక్తి లభిస్తుంది.
ఈ క్రింది అత్యవసర లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి:
శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది లేదా ఆయాసం రావడం.
ఛాతీలో లేదా పొత్తికడుపులో ఎడతెగని నైపి లేదా ఒత్తిడి అనిపించడం.
క్రమంగా మైకం రావడం, అయోమయం లేదా పిట్స్ రావడం.
మూత్ర విసర్జన తగ్గుముఖం పట్టడం.
జ్వరం, దగ్గు కాస్త తగ్గినా, మళ్లీ అంతకంటే తీవ్రంగా తిరగబెట్టడం.
వ్యాక్సిన్‌తో పాటు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, చేతులను తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, తుమ్మినప్పుడు/తగ్గినప్పుడు ముక్కు, నోటికి చేతిరుమాలు అడ్డుపెట్టుకోవడం ద్వారా H1N1 వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..