AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి ముందే ఆ కార్యం.. పవర్ కోసం ఓ మెడిసిన్.. కట్ చేస్తే, ఆమె వచ్చే లోపే బెడ్డుపై..

ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి తన కాబోయే భార్యను గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌కు కలుసుకోవడానికి ఆహ్వానించాడని, అయితే ఆమె అక్కడికి రాకముందే లైంగిక శక్తిని పెంచే మందు తీసుకుని.. మరణించిందని తేలిందని ఒక అధికారి తెలిపారు. అయితే.. అతని ఫ్రెండ్ ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో.. అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు.

పెళ్లికి ముందే ఆ కార్యం.. పవర్ కోసం ఓ మెడిసిన్.. కట్ చేస్తే, ఆమె వచ్చే లోపే బెడ్డుపై..
Gurugram Man Dies In Flat
Shaik Madar Saheb
|

Updated on: Apr 25, 2026 | 12:03 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో మంచి ఉద్యోగం.. ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరికొన్ని రోజుల్లో.. పెళ్లి.. ఈ క్రమంలోనే.. కాబోయే భార్యను ఫ్లాట్ కి పిలిచాడు.. ఆ తర్వాత ఇద్దరు ఏకాంతంగా కలుసుకుందాం అనుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆ యువకుడు హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు.. ఈ ఘటన ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని.. గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.. కాబోయే భార్యతో ఫ్లాట్‌లో ఉండగా.. వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. ‘లైంగిక శక్తిని పెంచే’ వయాగ్రా మందు అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పేర్కొంటున్నారు.

హర్యానాలోని గురుగ్రామ్‌లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందును అధిక మోతాదులో తీసుకోవడం వల్ల 29 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అతని గదిలో సప్లిమెంట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా వారు పేర్కొన్నారు.

నాగ్‌పూర్‌కు చెందిన ఆ వ్యక్తి.. పొరుగున ఉన్న గురుగ్రామ్‌లోని సెక్టార్ 53లో అద్దె ఫ్లాట్‌లో ఉంటూ, ఢిల్లీలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

మృతుడి సహోద్యోగి పోలీసులకు సమాచారం అందించడంతో గురువారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తామిద్దరం తరచుగా కలిసి ఆఫీసుకు వెళ్లేవాళ్లమని.. అయితే ఆ రోజు తన సహోద్యోగి ఫోన్‌కు లిఫ్ట్ చేయకపోవడం.. గది తలుపు తెరవకపోవడంతో.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించినట్లు ఆ వ్యక్తి చెప్పాడు.

సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలగొట్టగా, అక్కడ మంచం మీద ఆ వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నాడు..

గదిలో కొన్ని మందులు, ఆరోగ్య సప్లిమెంట్ల ప్యాకెట్లు కూడా లభించాయని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ప్రాథమిక విచారణలో..

ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి తన కాబోయే భార్యను ఏకాంతంగా కలవడానికి ఆహ్వానించాడని, అయితే, ఆమెను కలవక ముందే మరణించిందని తేలిందని ఒక సీనియర్ దర్యాప్తు అధికారి తెలిపారు.

అతను లైంగిక సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా మందు తీసుకున్నాడని, దాని అధిక మోతాదు గుండెపోటుకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

“మేము అంతర్గత అవయవాలను, స్వాధీనం చేసుకున్న మందులను పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాము . అంతర్గత అవయవాల నివేదిక అందిన తర్వాతే మరణానికి ఖచ్చితమైన కారణం వెల్లడవుతుంది. మేము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాము,” అని సెక్టార్ 53 ఎస్‌హెచ్‌ఓ సతేందర్ రావల్ చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.

ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us