Covid-19 Deaths: కరోనా మరణాలన్నీ తప్పుడు లెక్కలే.. నివేదికల్లో సంచలన విషయాలు.. తెలంగాణ, ఏపీలో

India Covid-19 Deaths: దేశంలో కరోనా విలయతాండవం మొదలైన నాటి నుంచి లక్షలాది మంది మరణించారు. అయితే.. దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో

Covid-19 Deaths: కరోనా మరణాలన్నీ తప్పుడు లెక్కలే.. నివేదికల్లో సంచలన విషయాలు.. తెలంగాణ, ఏపీలో
Coronavirus

Updated on: Jan 19, 2022 | 11:52 AM

India Covid-19 Deaths: దేశంలో కరోనా విలయతాండవం మొదలైన నాటి నుంచి లక్షలాది మంది మరణించారు. అయితే.. దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు తెలుపున్నాయి. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల గురించి సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని రుజువుచేస్తున్నాయి. అయితే.. కరోనాతో మరణించిన వారి కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న సమయంలో పలు రాష్ట్రాలు కరోనా మరణాలపై నివేదికలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ గణాంకాల ప్రకారం.. తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువ మరణాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు 7 నుంచి 9 రేట్లు అధికంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణలో పరిశీలిస్తే.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,993 కు పైగా మరణాలు నమోదయ్యాయి. కానీ కరోనా పరిహారం కోసం 28,969 దరఖాస్తులు వచ్చాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే 12,148 పైగా కేసుల్లో పరిహారం చెల్లించడం పూర్తయిందని పేర్కొంది. ఏపీలోనూ అధికారుల లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 14,471గా ఉండగా 36205 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు 11,464 దరఖాస్తుదారులకు పరిహారం మంజూరైందని వెల్లడించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అధికారిక కరోనా మృతులు 10,094 ఉండగా.. పరిహారం కోసం 89,633 దరఖాస్తులు వచ్చాయి. 58,843 దరఖాస్తులకు పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్రలో కరోనాతో 141737 మంది చనిపోగా.. 2,13890 దరఖాస్తులు వచ్చాయి. 92,275 దరఖాస్తులకు పరిహారం చెల్లించినట్లు ఠాక్రే ప్రభుత్వం తెలిపింది.

అయితే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధికారిక మృతుల సంఖ్యకు మించి పరిహారం కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సెకండ్ వేవ్‌లో కరోనాతో ఆస్పత్రుల్లో కంటే బయటే ఎక్కువ మంది ప్రజలు మృతి చెందారని పేర్కొంటున్నారు. అయితే అలా మరణించిన వారి వివరాలు గణాంకాల్లోకి చేరలేదని.. ఇప్పుడు దరఖాస్తులు ఎక్కువగా రావడానికి ఇదే కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. గతంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలు కీలక సూచనలు చేసింది. కరోనా పాజిటివ్‌గా తేలిన తర్వాత నెల రోజుల్లోపు మరణించిన అందరికీ పరిహారం ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

Also Read:

India Coronavirus: కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో భారీగా పెరిగిన కేసులు, మరణాలు..