గుజరాత్‌లో కుప్పకూలిన ఫైటర్‌ జెట్‌! ప్రమాదంలో పైలెట్‌ మృతి

గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సమీపంలో బుధవారం రాత్రి భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మరణించగా, మరొకరు గాయపడ్డారు. నైట్ మిషన్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఇంక్వైరీని ఆదేశించారు.

గుజరాత్‌లో కుప్పకూలిన ఫైటర్‌ జెట్‌! ప్రమాదంలో పైలెట్‌ మృతి
Fighter Jet

Updated on: Apr 03, 2025 | 10:41 AM

గుజరాత్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్‌ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోయింది. జామ్‌నగర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. నైట్ మిషన్‌లో భాగంగా జాగ్వార్ యుద్ద విమానాన్ని పైలట్లు నడుపుతుండగా సాంకేతికలోపంతో ప్రమాదం చోటచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. పైలట్ మృతి తీవ్ర విచారకరమని, కష్టసమయంలో ఆయన కుటుంబానికి భారత వైమానిక దళం అండగా ఉంటుందని కూడా ఎయిర్‌ ఫోర్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

జామ్‌నగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని సువర్ద గ్రామంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన తర్వాత కాక్‌పీట్, వెనుక భాగం వేర్వురు ప్రాంతాల్లో పడ్డాయి. అనంతరం చెలరేగిన మంటల్లో కాక్‌పీట్‌ దగ్దమయింది. రోజువారీ శిక్షణలో భాగంగా రెండు సీట్ల జాగ్వార్ యుద్ధ విమానాన్ని పైలట్లు నడిపినట్టు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. రెండు ఇంజిన్లు కలిగిన జాగ్వార్ యుద్ధ విమానం.. రన్‌వే లేకుండానే టేకాక్ కాగలదు. ఎయిర్‌ ఫోర్స్‌ విస్తృతంగా ఉపయోగించే ఈ యుద్ధ విమానాన్ని 70వ దశకంలో తొలిసారి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో చేర్చారు. గడిచిన కొన్నేళ్లలో అనేకసార్లు దీనిని అప్‌గ్రేడ్ చేశారు. లేజర్ గైడెడ్ బాంబులు, నైట్-విజన్ సామర్థ్యం దీని సొంతం. ఒకేసారి అనేక బాంబులు, మిసైళ్లను మోసుకెళ్లగలిగే జాగ్వార్.. అణు బాంబులు మోసుకెళ్లగలిగిన ఐఏఎఫ్‌లోని కొద్ది విమానాల్లో ఒకటి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి