
అక్రమ మద్యాన్ని అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగు చూసింది. గుజరాత్‌లో మద్యం మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన లక్షల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచిత్రమైన రీతిలో మద్యాన్ని దాచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో, పోలీసులకు మొదట్లో ఏమీ కనిపించలేదు. కానీ తరువాత పోలీసులు టాయిలెట్ స్విచ్ లాగినప్పుడు, కనిపించిన సీన్ చూసి అంతా షాక్ అయ్యారు. టాయిలెట్ సీటు కింద పెద్ద సంఖ్యలో మద్యం సీసాలు దాచి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
గత సంవత్సరం, వడోదర జిల్లా పోలీసులు ఇంట్లో బంకర్ తయారు చేసి మద్యం సీసాలను దాచిపెట్టిన విషయాన్ని బయటపెట్టారు. తాజాగా అహ్మదాబాద్ జిల్లాలోని అస్లాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బరేజా గ్రామంలో ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ టాయిలెట్ సీటు కింద మద్యం సీసాలను దాచిపెట్టిన విషయం బయటపడింది. బరేజా గ్రామంలో పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు దాచిపెట్టినట్లు అహ్మదాబాద్ గ్రామీణ పోలీసుల స్థానిక క్రైమ్ బ్రాంచ్ బృందానికి నిఘా సమాచారం అందింది.
బరేజా గ్రామంలోని రెండు ఇళ్లపై ఎల్‌సిబి బృందం దాడి చేసింది. ఈ సమయంలో, మొదట్లో పోలీసులకు అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. కానీ తరువాత గదిని సోదా చేస్తున్నప్పుడు పోలీసులకు రెండు స్విచ్‌లు ఉండటంతో అనుమానం వచ్చింది. పోలీసులు వాటిని బయటకు తీసినప్పుడు, గోడ వెనుక మద్యం కనిపించింది. దీని తరువాత, పోలీసులు మరోసారి ఇంటిని పూర్తిగా శోధించడం ప్రారంభించారు. పోలీసులు రెండవ ఇంటి ముందు ఉన్న టాయిలెట్‌లను తనిఖీ చేసినప్పుడు, టాయిలెట్ సీట్లలో ఒకదానిపై ఏదో తేడాను గమనించారు.
వారు సీటు తీసివేసినప్పుడు, అందరి కళ్ళు ఒక్కసారిగా బైర్లుకమ్మాయి. పోలీసులు టాయిలెట్ సీటు కింద బంకర్ లాంటి స్థలాన్ని కనుగొన్నారు. దాని నుండి పోలీసులు 792 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దీని మొత్తం విలువ రూ. 2.76 లక్షలు ఉంటుందని అంచనా. టాయిలెట్లలో తనిఖీ ప్రారంభించినప్పుడు, వారికి ఒక టాయిలెట్ సీటు చాలా వదులుగా ఉందని కనుగొన్నారు. ఇది బృందానికి అనుమానం కలిగించింది. సీటు ఎత్తి చూసేసరికి, అక్కడ నిల్వ ఉంచిన మద్యం సీసాలు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న స్మగ్లర్ కోసం వెతుకుతున్నారు.
వీడియో చూడండి..
Crawlspace under toilet seat, behind electrical sockets: Raid in Ahmedabad for illegal liquor leads police to bizarre spaces
Read more here: https://t.co/JEo4lSnAOv pic.twitter.com/JtZtbilsR3
— The Indian Express (@IndianExpress) August 11, 2025
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..