జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని కశ్మీర్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు గ్రేనెడ్ ఎటాక్‌కు దిగారు. యూనివర్సిటీ సమీపంలోని సర్ సయ్యద్ గేట్ వద్ద స్థానికులు నిలబడి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.