గ్రామ పంచాయితీ బంపర్ ఆఫర్.. టాక్స్ కట్టండి.. గోల్డ్ గెలవండి..!

| Edited By:

Dec 23, 2019 | 12:40 PM

పన్నులు సకాలంలో చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చినా.. గడువులోగా ఎవ్వరూ సరిగా చెల్లించరు. ప్రజలు పన్నులు చెల్లిస్తే ఖజానా నిండి.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ముఖ్యంగా గ్రామాల్లో టాక్స్‌లు కట్టించుకోవడం పెద్ద సవాల్‌తో కూడుకున్న పనే. మహారాష్ట్రలోని ఓ గ్రామం.. పన్నులు కట్టించుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేపట్టింది. వచ్చే ఏడాది మార్చి 15లోపు.. గ్రామపంచాయితీకి బకాయి పడ్డ టాక్స్‌లను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే… వారిని లక్కీడ్రాకు ఎంపిక చేస్తామంటూ ప్రకటించింది. ఈ డ్రాలో […]

గ్రామ పంచాయితీ బంపర్ ఆఫర్.. టాక్స్ కట్టండి.. గోల్డ్ గెలవండి..!
Follow us on

పన్నులు సకాలంలో చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చినా.. గడువులోగా ఎవ్వరూ సరిగా చెల్లించరు. ప్రజలు పన్నులు చెల్లిస్తే ఖజానా నిండి.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ముఖ్యంగా గ్రామాల్లో టాక్స్‌లు కట్టించుకోవడం పెద్ద సవాల్‌తో కూడుకున్న పనే. మహారాష్ట్రలోని ఓ గ్రామం.. పన్నులు కట్టించుకునేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేపట్టింది. వచ్చే ఏడాది మార్చి 15లోపు.. గ్రామపంచాయితీకి బకాయి పడ్డ టాక్స్‌లను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే… వారిని లక్కీడ్రాకు ఎంపిక చేస్తామంటూ ప్రకటించింది. ఈ డ్రాలో మీరు బంగారం గెలుచుకోవచ్చని తెలిపింది. సాంగ్లీ జిల్లా కడేగావ్ తాలూకాలోని వాంగీ అనే గ్రామంలోని పంచాయితీ ఈ నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. నిర్ణీత గడువులోగా టాక్స్‌లను చెల్లించిన వారి పేర్లను లక్కీడ్రాలో తీస్తామని.. తొలి రెండు స్థానాల్లో వచ్చినవారికి 5.0గ్రాములు, 3.0 గ్రాముల బంగారు ఉంగరాలు.. అలాగే మూడో స్థానంలో నిలిచిన వారికి 2.0 గ్రాముల బంగారం గెలుచుకుంటారంటూ వెల్లడించింది. దీంతో గ్రామంలోని ప్రజలు వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీపడుతున్నారు. ఈ పథకం గురించి ప్రకటించిన తర్వాత.. ప్రజలనుంచి మంచి స్పందన వస్తుందని గ్రామ సర్పంచ్ వెల్లడించారు.