కరోనా వ్యాక్సిన్ ఒప్పందంలో కేంద్రం తొలి అడుగు

| Edited By:

Aug 18, 2020 | 2:07 PM

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ అంశానికి సంబంధించి మూడు రోజుల్లోగా రోడ్‌ మ్యాప్‌ను ఇవ్వాలని

కరోనా వ్యాక్సిన్ ఒప్పందంలో కేంద్రం తొలి అడుగు
Follow us on

coronavirus vaccine deal: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఈ అంశానికి సంబంధించి మూడు రోజుల్లోగా రోడ్‌ మ్యాప్‌ను ఇవ్వాలని, ఐదు దేశీయ ఫార్మా కంపెనీలను కేంద్రం ఆహ్వానించింది. కరోనా వ్యాక్సిన్ విధానం గురించి చర్చించేందుకు సోమవారం నిపుణుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో భారీ ఎత్తున కరోనా వ్యాక్సిన్‌ని తయారు చేసేందుకు కావాల్సిన కనీస సమయం, ధర తదితర వివరాలను తెలపాలంటూ కేంద్రం ఐదు ఫార్మా కంపెనీలను కోరింది. అందులో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ చేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెన్నోవాలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి గురువారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయా సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వం సూచించింది. అయితే క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం అయిన వెంటనే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు తయారీదారులతో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది.

Read More:

‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌లో పవన్‌.. డైరెక్టర్ ఎవరంటే

వీటికి ఆమిర్ వివరణ ఇవ్వాలి: కంగనా