Aadhaar-Voter ID Linking: ఓటర్ ఐడీ-ఆధార్ కార్డ్ అనుసంధానం.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కీలక ప్రకటన..

Aadhaar-Voter ID Linking: మీకు ఓటు హక్కు ఉందా? మీరు ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఓటు వేస్తున్నారా? అయితే ఇక నుంచి..

Aadhaar-Voter ID Linking: ఓటర్ ఐడీ-ఆధార్ కార్డ్ అనుసంధానం.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కీలక ప్రకటన..
Aadhaar Links Voter Id
Follow us

|

Updated on: Mar 18, 2021 | 11:55 AM

Aadhaar-Voter ID Linking: మీకు ఓటు హక్కు ఉందా? మీరు ఒకటికి మించి ఎక్కువ చోట్ల ఓటు వేస్తున్నారా? అయితే ఇక నుంచి అలాంటివి చెల్లవు. అవును.. ఓటు హక్కు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. ఓటర్ ఐడీ డూప్లికేషన్‌ కాకుండా ఉండేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభ వేదికగా వెల్లడించారు. ఓటర్ ఐడీ డూప్లికేషన్‌ను అరికట్టడానికి ప్రభుత్వం ఓటర్ ఐడీ-ఆధార్ లింక్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓకే వ్యక్తి పలు చోట్ల ఓటు హక్కు కలిగి.. ఓటును దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

ఆధార్-ఓటర్ ఐడీ లింక్ చేయడం ద్వారా వ్యక్తుల గోప్యతకు నష్టం కలుగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ బుధవారం నాడు లోక్‌సభలో విపక్ష నేతలు అడిగిన ప్రశ్నకు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఎలక్టోరల్ రోల్ డేటాబేస్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ముఖ్యంగా ఇలా చేయడం ద్వారా దొంగ ఓట్లు, ఓటింగ్ సిస్టమ్‌ హైజాక్ చేయడం వంటి వాటిని నిరోధించవచ్చునని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అయితే, ఇది చేయాలంటే చట్టాలకు సవరణ చేయాల్సి ఉంటుందని, ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు.

కాగా, గత ఏడాది జనవరిలో ఎన్నికల కమిషన్ కూడా ఇదే అంశంపై కేంద్రాన్ని అభ్యర్థించింది. ఓటర్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు చట్టపరమైన అధికాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరింది. అయితే, ఆధార్-ఓటర్ కార్డు లింకింగ్‌పై భద్రతాపరమైన అంశాలను పరిశీలించాలని ఈసీకి ప్రభుత్వం సూచించింది. ఇదిలాఉంటే.. 2015లో ఆధార్-ఓటర్ కార్డు అనుసంధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

దీనిపై విచారించిన ధర్మాసనం.. ప్రాయోజిత పథకాల లబ్ధిదారులను గుర్తించడానికి మాత్రమే ఆధార్‌ను ఉపయోగించాలంటూ మధ్యంతర తీర్పునిచ్చింది. ఆ తరువాత 2018లో ఇచ్చిన తుది తీర్పులో.. గోప్యత అనేది వ్యక్తుల ప్రాథమిక హక్కు అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆధార్‌తో ఓటర్ ఐడీని అనుసంధానించడం ద్వారా వ్యక్తి గోప్యతకు భంగం వాటిల్లకుండా రక్షణలు కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

Also read:

Telangana Budget 2021 Live: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న హరీష్ రావు

Eggs Benefits: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ? వేసవిలో ఎగ్స్ తినడం వల్ల సమస్యలు ఉంటాయా..