
గత మూడు రోజులుగా టెన్షన్‌గా కొనసాగుతున్న తమిళనాడు రాజకీయాలు కొలిక్కి వచ్చినట్లే.. మళ్లీ మొదటికి వచ్చాయి. ఓదశలో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయోమో అన్నట్టుగా సీన్ మారడంతో అందిరి చూపు తమిళనాడుపైనే పడింది. కానీ కాంగ్రెస్ టీవీకేకు మద్దతు ఇవ్వడం, లెఫ్ట్ పార్టీలు కూడా మద్దుతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో శుక్రవారం టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. తమకు మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీవీకే తెలిపింది. ఈ మేరకు లోక్‌భవన్‌కు వెళ్లిన విజయ్ గవర్నర్‌తో సమావేశమయ్యారు.. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించినట్లు, శనివారం ప్రమాణం అన్నట్లు ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో తమకు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విజయ్ గవర్నర్‌కు లేఖలు అందజేసినట్లు వార్తలొచ్చాయి.. కాంగ్రెస్, లెఫ్ట్, VCK, IUMLల మద్దతుతో 120కి పెరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. వీసీకే, ఐయూఎంల్ లేఖలు అందజేయనట్లు లోక్ భవన్ తెలిపింది. ఇప్పటివరకు 116 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉందని .. పేర్కొంది.. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ నెలకొంది..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.